Chef Mehigan: రాజమౌళి కష్టమంతా వృథానేనా.. ఆ ఫేమస్ చెఫ్ కి ఆర్ఆర్ఆర్ సినిమా తెలియదట?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) తెరకెక్కించిన మూవీ ఆర్ఆర్ఆర్.

( RRR ) ఈ సినిమా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో విడుదల అయ్యి సంచలన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా కలెక్షన్ల విషయం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కాగా ఈ సినిమాలోని నాటు నాటు పాట( Naatu Naatu ) ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

నాటు నాటు పాట యూట్యూబ్లో రికార్డులన్నీ బద్దలు కొడుతూ అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలిసిందే.ఇక ఇందులో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు స్టెప్పులను ఇరగదీశారు.

ఈ సినిమాతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా గ్లోబల్ స్టార్ లుగా మారారు.

Chef Mehigan Says He Didnot Know Naatu Naatu And Rrr
Advertisement
Chef Mehigan Says He Didnot Know Naatu Naatu And Rrr-Chef Mehigan: రాజమ

ఇప్పటికీ ఈ సినిమా మేనియా ఇంకా తగ్గలేదు.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన సంగతి మన అందరికి తెలిసిందే.సినిమా గురించి ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి సినీ ప్రేక్షకుడిని అడిగినా కూడా చెబుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

కానీ తాజాగా ఒక ఫేమస్ చెఫ్ ఈ సినిమా గురించి చేసిన వాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.అసలు ఆర్ఆర్ఆర్ అంటే తెలియదని సినిమా గురించి తనకు ఐడియా లేదని తెలిపారు.

ఆ వివరాల్లోకి వెళితే.ప్రముఖ ఆస్ట్రేలియన్ చెఫ్ మెహిగాన్( Chef Mehigan ) ఇటీవల ఆంధ్రప్రదేశ్ వచ్చాడు.

ఈ సందర్బంగా అతను మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆర్ఆర్ఆర్ గురించి పక్కనే ఉన్న ఒక ఆమె ప్రశ్నించగా.

Chef Mehigan Says He Didnot Know Naatu Naatu And Rrr
ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

ఆర్ఆర్ఆర్ అంటే ఏంటి అంటూ ఎదురు ప్రశ్నించాడు.ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ సినిమా అని, ఆ మూవీలోని నాటు నాటు సాంగ్ ఇటీవల ఆస్కార్ కూడా గెలుచుకుందని ఆమె తెలపగా, ఆ విషయం పై మెహిగాన్ స్పందిస్తూ.నేను నాటు నాటు సాంగ్ వినలేదని, ఆర్ఆర్ఆర్ గురించి తనకి అసలు తెలియది అని తెలిపారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

అదేంటి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రికార్డులు కురిపిస్తుంటే ఇంతటి ఫేమస్ చెఫ్ కి ఆ సినిమా గురించి తెలియక పోవడం ఏంటి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.కొందరు నెటిజన్స్ అంటే రాజమౌళి కష్టమంతా వృధానేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు