Akkineni Akhil : అక్కినేని అఖిల్ పని అయిపోయినట్టేనా.. ఏజెంట్ సినిమాకు కూడా అలాంటి టాకే.. నెక్స్ట్ ఏంటి?

వారసత్వంగా వచ్చిన హీరోలకు ఇండస్ట్రీ బాగా ఇంపార్టెంట్ ఇస్తుంది.వారిలో టాలెంట్ లేకున్నా కూడా అవకాశాలు ఇస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు.

 Akkineni Akhil Back To Back Disaster Movies-TeluguStop.com

మంచి మంచి టాలెంట్ ఉన్న చిన్న హీరోలను తొక్కేసి ఎటువంటి టాలెంట్ లేని స్టార్ కిడ్స్ ను పైకి తీసుకెళ్తారు.కానీ ఏం లాభం కొంతమంది స్టార్ కిడ్స్ మాత్రం అవకాశాన్ని కాపాడుకోలేకపోతున్నారు.

ఇప్పుడు అటువంటి పరిస్థితి అక్కినేని వారసుడు అఖిల్( Akkineni Akhil ) కి ఎదురవుతుంది.

Telugu Akhil Akkineni, Akkineni, Nagarjuna, Sisindri, Surender Reddy, Tollywood-

సిసింద్రీ సినిమా( Sisindri Movie )తో చిన్న వయసులోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు అఖిల్.ఆ వయసులోనే తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశాడు.ఆ తర్వాత చదువులని విదేశాలలో తిరిగి మళ్లీ ఇండియాకి వచ్చి తండ్రి, తాతకు తగ్గట్టు పేరు సంపాదించుకోవాలని హీరోగా అడుగు పెట్టాలని అనుకున్నాడు.

అలా ఫ్యామిలీ అంతా కలిసి నటించిన మనం సినిమా( Manam )లో క్లైమాక్స్లో గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్.

ఇక అఖిల్ ఎంట్రీ తో తెలుగు ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు.

ఇక ఎలాగైనా స్టార్ హీరో అవుతాడు అని అందరూ ఆశలు పెంచుకున్నారు.అలా మొత్తానికి అఖిల్ కు.2015 లో వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్( Akhil Movie ) అనే సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది.కానీ ఎందుకో అంతగా టాక్ తెచ్చుకోలేదు ఈ సినిమా.

మొదటిసారి హీరోగా అడుగుపెట్టాడు అని ప్రేక్షకులంతా బాగానే ఆశలు పెంచుకున్నారు.

Telugu Akhil Akkineni, Akkineni, Nagarjuna, Sisindri, Surender Reddy, Tollywood-

కానీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఆ తర్వాత డైరెక్టర్ శీను విక్రమ్ కుమార్ దర్శకత్వంలో హలో సినిమా( Hello Movie )లో చేశాడు.ఇక ఈ సినిమా ఒకింత మెప్పించింది.

ఇక ఆ తర్వాత మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్( Most Eligible Bachelor ) సినిమాలలో చేశాడు.ఈ రెండు సినిమాలు కూడా పూర్తిగా డిజాస్టర్ అయ్యాయి.

ఇక ఆ సమయంలోనే అఖిల్ కి హీరోగా కలిసి రాదు అని చాలామంది అనుకున్నారు.

అయినా కూడా వెనుకడుగు వేయకుండా తనవంతు ప్రయత్నం చేయటానికి ముందుకు వచ్చాడు.

అలా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా( Agent Movie )కు బాగా హైప్ క్రియేట్ చేశాడు.దీంతో చాలామంది ప్రేక్షకులు ఈసారైనా సరైన హిట్టు అందుకుంటాడో లేదో అని అనుమానాలు పడ్డారు.

అన్నట్టుగానే ఈ సినిమా పూర్తి డిజాస్టర్ అయ్యింది.ఈ సినిమా చూసిన జనాలంతా ఓ రేంజ్ లో తిట్టిపోస్తున్నారు.

Telugu Akhil Akkineni, Akkineni, Nagarjuna, Sisindri, Surender Reddy, Tollywood-

ముఖ్యంగా అఖిల్ ను ఇక నీకు సినిమాలు సెట్ అవ్వవు పెట్ట సర్దుకోవడమే అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.అక్కినేని ఫ్యామిలీ కూడా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో సైలెంట్ అయ్యారు.ఇక ఈ సినిమా ప్లాఫ్ అవ్వడంతో అఖిల్ పని అయిపోయింది అని అందరూ అంటున్నారు.ఒకవేళ అఖిల్ మరో ప్రయత్నం చేసి ఏదైనా సినిమాతో వచ్చినా కూడా ఈసారి జనాలు చూడటానికి కూడా ఆసక్తి చూపించరు అని అర్థమవుతుంది.

Telugu Akhil Akkineni, Akkineni, Nagarjuna, Sisindri, Surender Reddy, Tollywood-

ఒక స్టార్ కిడ్( Star Kid ) అయినప్పటికీ కూడా అఖిల్ లో టాలెంట్ లేదు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.ఇవన్నీ మాటలు వింటుంటే అఖిల్ కి నెక్స్ట్ ఏ దర్శక నిర్మాతలు కూడా అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రారు అని అర్థమవుతుంది.ఒకవేళ ధైర్యం చేసి ఏ దర్శకుడైన ఆయనకు అవకాశం ఇస్తే ఆ సినిమా చూడటానికి జనాలు మాత్రం ఇష్టపడరని తెలుస్తుంది.మరి అఖిల్ నెక్స్ట్ ఏం చేయబోతాడో అనేది సస్పెన్స్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube