మోదీ గారి ‘మన్ కీ బాత్‘కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలుప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా నిర్వహిస్తోన్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఈ నెల 30వ తేదీతో 100 ఎపిసోడ్లు పూర్తవుతున్న శుభ సందర్భంలో వారికి నా శుభాభినందనలు తెలియజేస్తున్నానుదేశ ప్రధాని దేశవాసులతో రేడియో మాధ్యమం ద్వారా స్వయంగా ముచ్చటించే ఈ కార్యక్రమం శ్రోతలకు, తదుపరి టీవీ ప్రసారాల్లో చూసే వీక్షకులకు ఎంతో చేరువైంది.గణాంకాలు ఒకసారి పరిశీలిస్తే ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని 100 కోట్ల మంది ప్రజలు ఒక్కసారైన రేడియోలో వినడమో, టీవీలో చూడటమో జరిగిందిప్రతి నెల 23 కోట్ల మంది ఆదరిస్తున్నారని తెలిసి సంతోషం వేసింది2014 అక్టోబర్ 3న విజయదశమి నాడు ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రతి నెలా చివరి ఆదివారం నాడు నిరంతరాయంగా కొనసాగుతుండటం అద్భుతమైన విషయం.
ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో ప్రస్తావించే అంశాలు చాలా విభిన్నంగా ఉంటాయి.సామాన్యులు సాధించే విజయాలు, గొప్ప వ్యక్తులు, కళలు, చేతివృత్తులు, సేవా కార్యక్రమాలు, ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు… ఇలా అనేక అంశాలు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు దగ్గర చేశాయిదానికి తోడు మోదీ వాక్పటిమ, వివిధ అంశాలపై వారికున్న విశేష అనుభవం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత దగ్గర చేసింది.
ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభ సందేశంలో “సేవా పరమో ధర్మః” అని మోదీ పేర్కొనడం మనసులను హత్తుకునే విధంగా ఉందిఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి, కార్యక్రమ నిర్వాహకులకు నా శుభాకాంక్షలు
.