క్రీడాలతో విద్యార్థులుకు మానసికోల్లాసం - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శాత్రజపల్లి లో రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి ఆహ్వానిత వాలీబాల్ పోటీలను ప్రభుత్వ విప్ ,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

అలిశెట్టి ప్రభాకర్, స్వామి వివేకానంద చిత్రాపాటలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అలిశెట్టి ప్రభాకర్ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు.క్రీడల వల్ల మానసిక ఉల్లాషంతో పాటు శారీరక దృఢత్వం ఏర్పడుతుందని అన్నారు.

చదువుతో పాటు క్రీడలూ విద్యార్థులకు అవసరమని అన్నారు.ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను చదువులకే పరిమితం చేయకుండా క్రీడల్లోనూ ప్రోత్సహించాలన్నారు.అందరి సహకారంతో రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయిలో వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో, పోటీలను నిర్వహించుకుందాం అన్నారు.

Advertisement

చదువుతోపాటు క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు.యువత క్రీడల్లో రాణించి మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ
Advertisement

Latest Rajanna Sircilla News