Minister Gudivada Amarnath : చంద్రబాబుకు తోక పార్టీ కాంగ్రెస్..: మంత్రి గుడివాడ

ఏపీలోని వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్( Minister Gudivada Amarnath ) రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

వైసీపీతో తప్ప అన్ని పార్టీలతో చంద్రబాబు( Chandrababu ) పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు.చంద్రబాబుకు తోక పార్టీ కాంగ్రెస్( Congress ) అని ఆరోపించారు.

అలాగే పార్టీని వీడుతున్న నేతల వ్యవహారంపై స్పందించిన ఆయన పార్టీ ఎవరినీ వదులుకోదని చెప్పారు.

అయినా వెళ్లారంటే అది వారిష్టమని పేర్కొన్నారు.జగన్( CM Jagan ) తనకు ఎన్నో పదవులు ఇచ్చారన్న మంత్రి గుడివాడ జగన్ మళ్లీ సీఎం కావడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని తెలిపారు.అలాగే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని తెలిపారు.

Advertisement
మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..? 

తాజా వార్తలు