టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలకు జనాలు తండోపతండాలుగా వస్తున్న సంగతి తెలిసిందే.దీంతో నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన సభలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
భారీ జన సందోహం రావడంతో కార్యకర్తల మధ్య తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో 8 మంది మృతి చెందారు.మరి కొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వీరిలో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం.
కాగా దుర్ఘటన జరగక ముందు తోపులాట జరుగుతున్న సమయంలోనే కార్యకర్తలను.
చంద్రబాబు హెచ్చరించారు.వ్యాన్ వద్ద ఘటన జరగటంతో.
దానికి ముందే ఆ వ్యాన్ వద్ద జనాలు ఉండొద్దని దిగిపోవాలని చంద్రబాబు సూచించారు.చెబితే వినాలి.
అక్కడ ప్రాబ్లం ఉంది.మీటింగ్ సక్సెస్ కావాలి.
ఎవరు ఆ వ్యాన్ వద్ద ఉండొద్దు.అని చంద్రబాబు హెచ్చరించిన కాసేపటికే ఘటన జరగటం తీవ్ర విషాదం మిగిల్చింది.
ఈ క్రమంలో మృతులు పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.తన సభకి వచ్చి సామాన్యులు చనిపోవడం ఆవేదన కలిగించిందని తెలిపారు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం.పోలీసులు మరింత బందోబస్తు కల్పించాల్సి ఉండాల్సిందని చంద్రబాబు అన్నారు.