ఏపీలోని అన్ని పార్టీల్లోనూ వారసుల హవా ఎక్కువగానే కనిపిస్తోంది.ప్రస్తుతం ఉన్న సీనియర్ నాయకులు ఎక్కువ మంది వయసు వయసు పైబడిన వారే కావడంతో తమ వారసులను రంగంలోకి దించుతున్నారు.
కొంతమంది తండ్రి చాటు గా వెనక నుండి రాజకీయ చక్రం తిప్పుతుంటే, మరికొంతమంది మాత్రం ప్రజల్లో తిరుగుతూ తమ పెంచుకునే పనిలో పడ్డారు.

అయితే రాజకీయ వారసులకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మేరకు ఆదరణ లభిస్తుంది అనేది పెద్ద ప్రశ్నగా మారింది.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో వారసుల హవా ఎక్కువగా కనిపిస్తోంది.ప్రస్తుతం పార్టీ అధికారంలో లేకపోవడంతో సైలెంట్ గా పొలిటికల్ మైలేజ్ పెంచుకునే పనిలో నాయకుల వారసులు తెర చాటు వ్యవాహారాలు నడిపిస్తున్నారు.
ఇప్పటి నుంచే రాజకీయ ఓనమాలు దిద్దితే ఎన్నికల సమయం నాటికి తమ ఇమేజ్ పెరిగి ఎన్నికల్లో సులభంగా గెలుపు జెండా ఎగురవేయవచ్చని వారంతా భావిస్తున్నారు.

ప్రకాశం జిల్లా టిడిపి సీనియర్ నాయకుడు కరణం బలరాం తమ రాజకీయ వారసుడిగా వెంకటేష్ ను ఇప్పటికే రాజకీయాల్లో యాక్టివ్ చేశారు.2014 ఎన్నికల్లో తమ కుమారుడికి టికెట్ ఇప్పించు కున్నారు కానీ ఆయన ఓటమి చవిచూడాల్సి వచ్చింది.మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు సుధీర్ కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు.
తన తండ్రికి మంత్రిగా పనిచేసిన సమయంలోనే సుధీర్ దర్శి నియోజకవర్గంలో చక్రం తిప్పాడు.వచ్చే ఎన్నికల నాటికి తానే బరిలో ఎందుకు ప్రయత్నిస్తున్నాడు.ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి జిల్లాలోనూ ఐదారుగురు సీనియర్లు తమ వారసులను రాజకీయంగా యాక్టివ్ చేస్తున్నారు.వైసిపి నాయకులు కూడా తమ రాజకీయ వారసులను పాలిటిక్స్ లో చురుగ్గా ఉండేలా ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు.

పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండటంతో వారసులు తమ హవా చూపిస్తున్నారు.వారసుల ఎంట్రీకి పార్టీ అధిష్టానం నుంచి కూడా ఆమోదం ఉండడంతో కొడుకుల రాజకీయ ప్రవేశానికి ప్రోత్సాహం ఎక్కువయింది.అయితే ఈ విషయంలో ప్రజాదరణ ఏ విధంగా ఉంటుంది అనేది తేలాల్సి ఉంది.ఎందుకంటే రాజకీయాలు సమీకరణాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు.

పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి.ఇప్పటికే టీడీపీ నుంచి పోటీ చేసిన చాలామంది రాజకీయ వారసులు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.అందుకే ఇప్పటి నుంచే ప్రజల్లో ఆదరణ బాగా పెంచుకుంటే ఎన్నికల నాటికి సులభంగా గెలవవచ్చు అనేది నాయకుల ఆలోచనగా తెలుస్తోంది.