ఏపీలో ఎప్పుడు ఎన్నికల్లు వచ్చినా సరే గెలుపు కచ్చితంగా కావాలంటున్నారు చంద్రబాబుఇందుకోసం ఏమేం చేయాలో అన్నీ చేసేస్తున్నారు.అయితే ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత కాబట్టి ఎలా స్పందించాలో అలా స్పందిస్తున్నారు.
కానీ కొన్ని సార్లు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ కోసం కష్టపడుతున్న వారిని ఇబ్బందుల్లో పడేస్తున్నాయి .ప్రస్తుతం టీడీపీలో కోవర్టులు ఎక్కువవుతున్నారనేది కాదనలేని సత్యం.చాలామంది పార్టీని ఇబ్బందుల్లో పడేస్తున్నారు.చంద్రబాబునే స్వయంగా విమర్శిస్తున్నారు కూడా.
దీంతో అలాంటి వారికి బుద్ధి చెప్పాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.ప్రస్తుతం ఆయన ఎవరినీ పార్టీ నుంచి పంపించేందుకు సిద్ధంగా లేరు.
ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఆయనకు ప్రతి నేత సాయం చాలా అవసరం.అందుకే అందరినీ మారాలంటూ కోరుతున్నారు.
కొన్ని సార్లు ప్రక్షాళన తప్పదంటున్నారు.ఇదే అందరినీ కలవర పెడుతోంది.
ఎందుకంటే పార్టీ కోసం చాలామంది కష్టపడి పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు.ప్రక్షాళన చేస్తే అలాంటి వారికి ఇబ్బందులు తప్పవు.
కాబట్టి వారంతా ఇప్పడు టెన్షన్ పడుతున్నారు.

ఎక్కడ తమకు అన్యాయం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారంట.చంద్రబాబు కొందరిని దృష్టిలో పెట్టుకుని అందరినీ అవమానిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.వాస్తవానికి పార్టీలో ప్రక్షాళన అంటూ చేయాల్సి వస్తే పార్టీలో చురుగ్గా లేనటువంటి చాలామంది సీనియర్లను పక్కన పెట్టేయాలి.
యువతను ప్రోత్సహించాలి.పార్టీ కోసం కష్టపడుతున్న వారికి పదవులు ఇచ్చి తన నిర్ణయాన్ని సూటిగా చెప్పేయాలి.
కానీ అందరినీ ఒకే దృష్టిలో చూడడం వల్లే ఆయన ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని తెలుస్తోంది.అందరినీ ఒకే దృష్టితో చూడకుండా పార్టీ కోసం కష్టపడుతున్న వారికి ముందుగా పదవులు ఇచ్చేసి ఆ తర్వాత వ్యతిరేకంగా ఉంటున్న వారిని దారిలోకి తెచ్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.