చంద్రబాబు అరెస్ట్ .. పవన్ కు బీజేపీ ఆ క్లారిటీ ఇచ్చిందా ?

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్( Chandrababu arrest ) వ్యవహారంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.కొత్త కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి.

వైసీపీ మినహా ఇప్పటికే అన్ని పార్టీలు చంద్రబాబు అరెస్టును ఖండించాయి.  ఈ విషయంలో కేంద్ర అధికార పార్టీ బిజెపి వైఖరి స్పష్టమైంది.

చంద్రబాబు అరెస్టును ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి ముందుగా ఖండించనా,  ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.  టిడిపి ఇచ్చిన బంద్ కు బిజెపి మద్దతు లేదు అని ఆమె స్వయంగా ప్రకటించారు.

  ఇక కేంద్ర బీజేపీ పెద్దలు సైతం చంద్రబాబు అరెస్టుపై మౌనంగా ఉన్నారు.

Advertisement

దీనికి తోడు ఈ రోజు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( CM jagan ) ను ఢిల్లీకి పిలిపించి మంతనాలు చేయబోతున్నారు.ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న జనసేన పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.ఇప్పటికే చంద్రబాబు అరెస్టు పై పవన్ హడావుడి చేశారు.

రోడ్డుపై పడుకుని మరి తన నిరసనను తెలియజేశారు.టిడిపి నిర్వహించిన బంద్ కార్యక్రమానికి జనసేన మద్దతు పలికింది.

 చంద్రబాబు అరెస్టు ను తప్పుపడుతూ పవన్ మీడియా సమావేశం( Pawan kalyan ) కూడా నిర్వహించారు.అయితే ఇప్పుడు పవన్ కాస్త సైలెంట్ అయినట్టుగా కనిపిస్తున్నారు.

దీనికి కారణం ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై బీజేపీ పెద్దలు పవన్ కు క్లారిటీ ఇవ్వడమే.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

చాలా రోజులుగా పవన్ జనసేన, బిజెపితో టిడిపిని కలుపుకు వెళ్లాలనే ప్రతిపాదనను కేంద్ర బిజెపి పెద్దల వద్ద అనేకసార్లు ప్రస్తావించినా,  బిజెపి పెద్దలు మాత్రం మౌనంగానే ఉన్నారు.అధికార పార్టీ వైసీపీని ఓడించాలంటే కచ్చితంగా మూడు పార్టీలు కలవాల్సిందేనని,  టిడిపి లేకుండా జనసేన,  బిజెపి ఒంటరిగా వైసీపీని ఎదుర్కొన్న ఫలితం ఉండదనే లెక్కల్లో పవన్ ఉంటూ వచ్చారు.అయితే చంద్రబాబు అరెస్టు వ్యవహారం తరువాత బిజెపి పెద్దలు స్పందించకపోవడం తో పవన్ కూడా సైలెంట్ అయ్యారు.

Advertisement

చంద్రబాబు అరెస్టు తదితర పరిణామాలతో రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత బలహీనమవుతుందని జనసేన, బీజేపీలు ఏపీలో బలపడేందుకు ఇదే సరైన సమయం అని,  ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే రాజకీయంగా ఉన్నత స్థితికి వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుందని బిజెపి పెద్దలకు కొంతమంది పవన్ కు హితబోధ చేశారట.అదీ కాకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ,జైలు పాలైన చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం ద్వారా  వచ్చే ప్రయోజనం కంటే , నష్టమే ఎక్కువ ఉంటుందని పవన్ కు సూచించడంతో పవన్ కూడా ఆలోచనలు పడ్డారట.

తాజా వార్తలు