మోడీ... బాబు గారి...దెబ్బ అదుర్స్ కదూ...

విభజనపై విషయంలో విభజన హామీల అమలు విషయంలో కేంద్రం ఎపీని ఎంతగా మోసం చేసిందో వేరే చెప్పనవసరం లేదు.

ప్రజా నిరసనల ద్వారా అయినా కేంద్రం కదులుతుంది అంటుకుంటే వైసీపితో కలిసి మరిన్ని ఎత్తులు వేస్తూ ఏపీలో టీడీపీ ని దెబ్బకొట్టాలని చూస్తోంది.

ఈ క్రమంలోనే చంద్రబాబు విభజన విషయంలో అన్యాయం జరిగిందంటూ కోర్టుకు వెళ్ళారు.నవ్యాంధ్రకు విభజన హామీలు నెరవేర్చలేదంటూ టీడీపీ నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

గతంలో చంద్రబాబు కోర్టుకు వెళ్తాం విభజన హామీల విషయంలో అంటూ ప్రకటించిన సంగతి విదితమే.ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం పక్కన పెట్టిందని హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చినట్లుగా నిధులు ఇవ్వడం లేదని తెలిపింది.తాము వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.24,350 కోట్లు అడిగితే, కేంద్రం కేవలం రూ.1,050 కోట్లు మంజూరు చేసిందని సుప్రీంకు తెలిపింది.అంతేకాదు రాజధాని అమరావతికి రూ.11,602 కోట్లు అడిగితే కేవలం రూ.1,500 కోట్లు ఇచ్చిందని పేర్కొంది.పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7,918 కోట్లు ఖర్చు చేసిందని అఫిడవిట్లో పేర్కొంది.కానీ కేంద్రం రూ.5349 కోట్లు విడుదల చేసిందని తెలిపింది.

ఇదిలాఉంటే పోలవరం ప్రాజెక్టు వ్యయం విషయంలో అంచనాలను రూ.57,948 కోట్లను కేంద్రం అంగీకరించడం లేదని తెలిపింది.ప్రత్యేక రైల్వే జోన్ అంశాన్ని పక్కన పెట్టిందని తెలిపింది.

Advertisement

చట్టంలో పొందుపర్చిన హామీలను నిర్ణీత వ్యవధిలో ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీం కోర్టును అభ్యర్థించింది.ఈ నాలుగేళ్ల కాలంలో కేంద్రం చేసింది చాలా తక్కువని మేము చాలా నస్త పోతున్నామని తెలిపింది.

విభజన చట్టంలోని ముఖ్యమైన హామీలు అమలు కాలేదంటూ సుదీర్ఘ అఫిడవిట్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం.పదో షెడ్యూలులోని సంస్థల విభజన ఇంకా జరగలేదని ప్రభుత్వం పేర్కొంది.142.సంస్థలను విభజించలేదని, కేంద్రం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందించలేదని పేర్కంది.అంతేకాదు సహజ వాయువులు అయిన బొగ్గు, చమురు, విద్యుత్ అంశాలు పెండింగులో ఉన్నాయని.

కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వే జోన్ అంశాలను తేల్చలేదని పేర్కొంది.గత ప్రభుత్వం ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, అది నెరవేరలేదని చెప్పారు.వెనుకబడిన జిల్లాల కోసం రూ.350 కోట్ల చొప్పున 1050 కోట్లను తొలి మూడేళ్లలో విడుదల చేసిందని.బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీలో ఒక్కొక్కరిపై రూ.4115 ఇస్తుండగా ఏపీ విషయంలో రూ.428.57 మాత్రమే ఇస్తున్నారని పేర్కొంది.అయితే ప్రాజెక్టు ప్రభావిత ప్రాంత ప్రజలు.

గ్రామాలు.అటవీ ప్రాంతం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

చారిత్రక ఆలయాలు.గిరిజనుల సంస్కృతి, గోదావరి నది తదితర అంశాలను విస్మరించి ఈ ప్రాజెక్టు చేపడుతున్నామన్నది ముమ్మాటికి అవాస్తవం అని తెలిపింది.

Advertisement

అన్ని విషయాలు మేము పరిగణలోకి తీసుకున్నామని కోర్టుకి తెలిపింది.అయితే ఇప్పుడు కేంద్రం పై చంద్రబాబు కోర్టుకు వెళ్ళడం ఏపీకి అన్యాయం జరగిందని చెప్పాడా అంతా కేంద్రాన్ని ఏపీలో బూచి ని చేసి చూపించి ఏపీ ప్రజలలో తెలుగుదేశం పార్టీ పై సానుభూతి తెచ్చుకోవాలనేది చంద్రబాబు అసలు ప్లాన్ అంటున్నారు విశ్లేషకులు.

తాజా వార్తలు