తిట్టినా తట్టుకుందాం ! పవన్ పై టీడీపీ వ్యూహం ఇదే !

టీడీపీ అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఏదో కలిసొచ్చే అంశమే ఉంటుంది.తాత్కాలిక ప్రయోజనం బాబు ఎప్పుడూ ఆశించడు.

భవిష్యత్తులో కూడా ఎవరి వాల్ల ఉపయోగం ఉంటుందో ముందుగానే పసిగట్టి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తుంటాడు.ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలోనూ బాబు అదే విధంగా వ్యవహరిస్తున్నాడు.

ప‌వ‌న్‌ వరుసగా విమ‌ర్శలు చేస్తున్నా టీడీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది.ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా వాటిని రాజ‌కీయాంగా తిప్పికొడుతోంది తప్ప ప‌వ‌న్ వ్యక్తిగ‌త విష‌యాల జోలికి వెళ్ళడం లేదు.

దీనికి కారణం ఏంటా అనే ఆలోచనలో ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు పడిపోయారు.

Advertisement

ఏపీలో ఇప్పుడు రాజకీయ పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి.వైసీపీ, బీజేపీ, జ‌న‌సేన ఈ మూడు పార్టీలు టీడీపీ టార్గెట్‌గా పావులు క‌దుపుతున్నాయి.ఈ నేప‌ధ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌ను ఎప్పటిక‌ప్పుడు నిశితంగా గ‌మ‌నిస్తూ పార్టీ నేత‌ల‌కు ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తున్నాడు.

ఎవ‌రి ట్రాప్‌లో పార్టీ నేత‌లు ప‌డ‌కుండా దిశానిర్దేశం చేస్తున్నారు.మ‌రీ ముఖ్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్రాప్‌లో అస‌లు టీడీపీ నేత‌లు ప‌డ‌కుండా ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేస్తున్నాడు.

పవన్ తో భవిష్యత్తులో ఏదైనా అవసరం ఉంటుందనే కోణంలో బాబు ఉన్నట్టు కనిపిస్తోంది.

ప్రస్తుతం ప‌శ్చిమ‌లో ప‌ర్యటిస్తున్న ప‌వ‌న్ ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల‌ను టార్గెట్ చేసుకుని విమ‌ర్శలు చేస్తున్నారు.టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతూ ప్రజ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తున్నార‌ని విమర్శిస్తున్నారు.ప‌వ‌న్ చేస్తున్న విమ‌ర్శల‌ను ఎలా తిప్పికొట్టాలి అనే దానిపైనే టీడీపీ ఫోక‌స్ చేసింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పవన్‌.చింత‌మ‌నేని రౌడీ ఎమ్మెల్యే అంటూ ఆయ‌న‌పై అనేక కేసులు ఉన్నాయ‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని విమ‌ర్శలు గుప్పించారు.

Advertisement

అయితే ప‌వ‌న్ వ్యాఖ్యల‌కు చింత‌మ‌నేని ఘాటుగానే కౌంట‌ర్ ఇచ్చినా.ఎక్కడా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళలేదు.

దీనికి కారణం టీడీపీ హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆధారాలు ఉండడమే అని తెలుస్తోంది.

తాజా వార్తలు