భారమైనా బాబు కి తప్పదుగా ?

టీడీపీ అధినేత చంద్రబాబు ఏదో ఒక అంశం తో రాజకీయంగా యాక్టివ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు.

  ఏదో ఒక అంశం తో ప్రజలపై పోరాడుతూ,  ప్రజల్లో తిరుగుతూ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

ఎప్పుడూ  గెలుపు తప్ప,  ఓటమిని అసలు ఏ మాత్రం ఆయన అంగీకరించరు.  తన కంటే సమర్ధులైన వారు మరెవరూ లేరు అన్న అభిప్రాయంలో బాబు ఉంటూ ఉంటారు.2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి చెందడాన్ని ఇప్పటికీ బాబు జీర్ణించుకోలేకపోతున్నారు.ఏదో రకంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకు వచ్చి,  తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలనే లక్ష్యంతో బాబు పనిచేస్తున్నారు.

  అందుకే ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా పోరాటం చేస్తున్నారు.ఇటీవల అసెంబ్లీలో తన కుటుంబానికి జరిగిన అవమానాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటూ టీడీపీ పై సానుభూతి పెరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

  నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ , సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.అయితే చంద్రబాబు ఒక్కడి పైనే భారం అంతా పడిపోయింది.  టీడీపీ ని జనాల్లో కి తీసుకు వెళ్లడం దగ్గర నుంచి వ్యూహాలు అందించడం , పార్టీ కేడర్ కు తగిన సలహాలు , సూచనలు ఇవ్వడం ఇవన్నీ బాబు కి ఇప్పుడున్న పరిస్థితుల్లో భారంగానే ఉన్నాయి .

Advertisement

పార్టీ సీనియర్లు ఈ విషయంలో అక్కరకు వస్తారా అంటే వారి వల్ల పెద్దగా ఉపయోగం లేదు అన్నట్లుగా పరిస్థితి ఉంది.  సీనియర్ నాయకులను పూర్తిగా నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి.ఏదో పార్టీ లో ఉన్నాము అన్న పేరు తప్ప, ఏ విషయంలోనూ  వారు ఆసక్తి చూపించడం లేదు.

చంద్రబాబు కుమారుడు లోకేష్ ద్వారా అయినా బాబు కి కాస్త రిలీఫ్ దొరుకుతుందా అంటే ఆయన కూడా బాబు పైనే భారం అన్నట్టుగా వ్యవహారాలు చేస్తున్నాడు.ఇవన్నీ చంద్రబాబు లో మరింత ప్రెస్టేషన్ కలిగిస్తున్నాయి.2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ ఓటమి చెందడం , మళ్ళీ  ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంలో స్పష్టమైన క్లారిటీ లేకపోవడం, లోకేష్ తీరుపై పార్టీ నాయకులలోనూ పెద్దగా నమ్మకాలు లేకపోవడం ఇవన్నీ బాబు కు తలనొప్పి వ్యవహారాలే.వయసురీత్యా పార్టీని ముందుకు నడిపించడం భారమైనా మరో ఆప్షన్ కనిపించకపోవడంతో బాబే యాక్టి వ్ గా  ఉంటూ పార్టీని ముందుకు నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు