బుల్లితెర నంబర్ 1 యాంకర్ సుమ కనకాల దాదాపు రెండు దశాబ్దాల నుంచి యాంకర్ గా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు.ఈటీవీ ఛానల్ లో క్యాష్, స్టార్ మా ఛానల్ లో స్టార్ట్ మ్యూజిక్, జీ తెలుగు ఛానల్ లో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షోలకు ప్రస్తుతం సుమ కనకాల యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లతో సుమ కనకాల బిజీగా ఉన్నారు.
సుమ ఈటీవీలో చేస్తున్న క్యాష్ ప్రోగ్రామ్ ప్రోమో తాజాగా విడుదల కాగా ఈ ప్రోగ్రామ్ కు మాధవీలత, అదిరే అభి, హిమజ, చలాకీ చంటి వచ్చారు.
అదిరే అభి పాటకు డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇవ్వగా రెగ్యులర్ డ్యాన్స్ చేస్తూ ఉంటావా.? అని సుమ అడుగుతారు.అదిరే అభి సమాధానంగా నా స్కిట్ లో కామెడీ కంటే డ్యాన్స్ ఎక్కువగా ఉంటుందని చెబుతారు.సుమ వెంటనే డ్యాన్స్ ఉందా.? కామెడీ ఉందా.? అనే విషయం తెలియకుండా జరిగే షోనే క్యాష్ షో అని చెబుతారు.
గడ్డం గీసుకుని వస్తే మాత్రం చలాకీ చంటి యంగ్ అయిపోతాడా.? అనగా చంటి మేకప్ వేసుకున్నంత మాత్రాన యంగ్ అనుకుంటున్నారేమో.? అని రివర్స్ పంచ్ వేస్తాడు.ఆ తరువాత సుమ హార్డ్ వేర్ సొల్యూషన్స్ అనే పేరుతో స్కిట్ చేయగా ఆ స్కిట్ లో ఇంటర్వ్యూ కోసం చంటిని పిలుస్తున్నారు.చంటి మేడం నమస్తే అంటూ ఎంట్రీ ఇచ్చి కత్తిలా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తారు.
ఆ కామెంట్ కు సుమ మొహం మారిపోయింది.
అయితే నెటిజన్లు, సుమ ఫ్యాన్స్ మాత్రం చంటి అలా కామెంట్ చేయకపోయి ఉంటే బాగుండేదని సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.ఆ తరువాత మాధవీలత, అదిరే అభి పంచ్ లు వేసి కడుపుబ్బా నవ్వించారు.20వ తేదీ రాత్రి 9 : 30 గంటలకు క్యాష్ ప్రోగ్రామ్ ప్రసారం కానుంది.మాధవీలత ఈ షోలో పవన్ కళ్యాణ్ కళ్లు అబ్బబ్బాబ్బా కళ్లే కళ్లు అని అనడంతో పాటు ఖుషీ సినిమా ఎంతో ఇష్టమని తెలిపారు.