పెద్ద పెద్ద సినిమాలు వచ్చినప్పటికీ కూడా మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమాలైనా ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడుతుతారు.ఆ చిన్న సినిమాలలో సస్పెన్స్ స్టోరీ ఉంటే అసలు వదలడం లేరు.
అందుకే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్లు చిన్న చిన్న సినిమాలు అయినా సరే మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఇప్పుడు అటువంటి సినిమానే ‘చక్రవ్యూహం( Chakravyuham )’.
చెట్కూరి మధుసూదన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.ఈ సినిమాతో డైరెక్టర్ గా తొలిసారిగా పరిచయం అయ్యాడు మధుసూదన్.
బేబీ అన్వి సమర్పణలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీమతి.సావిత్రి నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.నటుడు అజయ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు.
కథ:
కథ విషయానికి వస్తే ఇందులో సంజయ్ వివేక్ పాత్రలో, సిరి ఊర్వశి పరదేశి ( Urvashi Pardesi )పాత్రలో కనిపిస్తారు.అయితే వీరిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు.పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా తమ జీవనాన్ని కొనసాగిస్తారు.అయితే అనుకోకుండా మీరు జీవితంలో ఊహించని మలుపు జరుగుతుంది.సిరిని హత్య చేస్తారు.
తర్వాత ఒక హత్యకు సంబంధించిన వాళ్ళందరూ పరుసగా హత్యకు గురవుతూ ఉంటారు.అలా వరుస మరణాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది.
ఇంతకు ఎవరు చంపేస్తున్నారు అని ట్విస్ట్ లతో కూడినది.ఇక ఇందులో శరత్, శిల్పల పాత్ర ఏమిటి.
ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అనేది మిగిలిన కథలు చూడాల్సిందే.
నటినటుల నటన
: సంజయ్ తన పాత్రతో బాగా ఆకట్టుకున్నాడు.ఒకవైపు భర్తగా మరోవైపు సైకోగా తన ఎక్స్ప్రెషన్స్ తో ఫిదా చేశాడు.ఇక సిరి కూడా పాత్రలో మునిగిపోయింది అని చెప్పాలి.
పోలీస్ పాత్రలో అజయ్ ( Ajay )అద్భుతంగా నటించాడు.హీరో ఫ్రెండ్స్ గా తిరందసు, కిరీటి కూడా బాగా నటించారు.
ఇక హీరోయిన్ కి తల్లి తండ్రులుగా నటించిన ప్రియా, రాజీవ్ కనకాల పర్ఫామెన్స్ కూడా బాగానే ఉంది.ఇక మిగతా నటీనటలంత తమ పాత్రకు తగ్గట్టుగా న్యాయం చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ విషయానికి వస్తే. డైరెక్టర్ మధుసూదన్ తొలిసారిగా ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయమైనప్పటికీ కూడా అనుభవమున్న దర్శకుడిగా సినిమాను చూపించాడు.మంచి సస్పెన్స్ తో ఉన్న కథను, చూపించే విధానంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.ముఖ్యంగా కథకు తగ్గట్టుగా నటీనటులను ఎంపిక చేసుకున్నాడు.భరత్ మంచిరాజు అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది.సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.
మిగిలిన నిర్మాణ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.
విశ్లేషణ:
డైరెక్టర్ ఈ సినిమాతో ప్రేక్షకులను లీనమయ్యేలా చేశాడని చెప్పవచ్చు.సస్పెన్స్ గా సాగే ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి ఆలోచనలు మరోవైపు మళ్లకుండా చేశాడు.తర్వాత సీన్లో ఏం జరుగుతుంది అనేది ఊహించడం కష్టం అన్నట్లుగా చూపించాడు.
ప్లస్ పాయింట్స్:
కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల నటన, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ట్విస్ట్ లు.
మైనస్ పాయింట్స్:
కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించాయి.
బాటమ్ లైన్
: చివరిగా చెప్పాల్సిందేంటంటే మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని చెప్పవచ్చు.