ఐద్వా ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి

ఖమ్మం జిల్లా: ఐద్వా వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వీర తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 37వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

శనివారం వైరా మున్సిపాలిటీ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి ఐద్వా సీనియర్ నాయకులు చావా కళావతి, గండగలపాడు గ్రామంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఐద్వా వైరా పట్టణ అధ్యక్షురాలు మచ్చా మణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఐద్వా వైరా పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మచ్చా మణి, గుడిమెట్ల రజిత మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం భూస్వాములు, పెత్తందార్లు పైన వీరోచితంగా పోరాడి తెలంగాణ మహిళల గుండె ధైర్యాన్ని, తేగువను ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పు కణిక చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాల్లు భుక్యా విజయ, బత్తుల ప్రమీల, భందెల అమృతమ్మ, తాటి కృష్ణకుమారి, దుద్దుకూరు వీరమ్మ, రాచబంటి విజయ, దుద్దుకూరి సీతారామమ్మ, దొంతెబోయిన రాధమ్మ, చిత్తారి నాగమ్మ, భుక్యా సృజన, నాగలక్ష్మి, ఆదిలక్ష్మి, నాగమణి, రజిని, సరస్వతి, కల్పన, తిరపమ్మ తదితరులు పాల్గొన్నారు.

కొత్త కార్యాలయంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీ

Latest Video Uploads News