వర్షాన్ని సైతం లెక్క చేయని సెస్ అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని తొమ్మిదవ వార్డులో అడేపు రాజ్ కుమార్ ఇంటి వద్ద గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు, గాలికి విద్యుత్ స్తంభం వంగిపోతు కిందపడే స్థితిలో ఉండగా కర్రను సపోర్ట్ పెట్టి ఉంచిన విషయాన్ని అక్కడి వార్డు ప్రజలు స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు.

దీంతో ఇట్టి విషయం సెస్ ఏ ఈ పృథ్వీ ధర్ కు పోన్ ద్వారా వివరించగా వెంటనే స్పందించి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సెస్ సిబ్బంది తో మిషన్ ద్వారా విద్యుత్ స్తంభం సరి చేయించారు.

వంగి కింద పడిపోయే స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభం పరిశీలించిన మూడు గంటల వ్యవధిలోనే విద్యుత్ స్తంభం ను సెస్ అధికారులు సరి చేయించారు.ఎలాంటి విద్యుత్ ప్రమాదం జరగకముందే అప్రమత్తమై విద్యుత్ స్తంభం సరి చేయించిన సెస్ అధికారులకు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ కు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

Latest Rajanna Sircilla News