ఆ ఏరియాల్లో సెకండ్ వేవ్ బీభత్సం.. మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం..!

కరోనా సెకండ్ వేవ్ అన్ని ప్రాంతాల వారికి ఎఫెక్ట్ చూపిస్తుంది.

ఇన్నాళ్లు పట్టణాలు మాత్రమే కేసులు అధికంగా ఉన్నాయని అనుకోగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను కూడా ప్రభావితం చేస్తున్నాయని కేంద్రం ఆందోళన చెందుతుంది.

ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల్లో కోవిడ్ కంటైన్మెంట్ నిర్వణ మార్గదర్శకాలు జారీ చేసింది.ఈ కంటైన్మెంట్ సెంటర్స్ ద్వారా బాధితులకు అవసరమైన సౌకర్యాలను కల్పించనున్నారు.

గ్రామీణ ప్రజల్లో అనారోగ్యం, శ్వాస సంబంధిత సమస్యలపై నిఘా ఉంచాలని చెప్పారు.ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లతో కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు.

కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి టెలీ మెడిసిన్ సేవలు అందించాలని అన్నారు.సెకండ్ వేవ్ దాదాపు 85 శాతం వరకు స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని కేంద్రం పేర్కొంది.

Advertisement

స్వల్ప లక్షణాలు ఉన్న వారు హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకోవాలని అన్నారు.ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.

ఆక్సిజన్ స్థాయి పడిపోతున్న వారిని పెద్ద హాస్పిటల్స్ లో చేర్పించాలని చెప్పారు.అంతేకాదు ర్యాపిడ్ పరీక్షలు ఏ.ఎన్.ఎం, సీ.హెచ్.ఓ లకు శిక్షణ ఇవ్వాలని.

ఇక మీద అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లో పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.గ్రామాల్లో కూడా ఆక్సీమీటర్లు, ధర్మామీటర్లు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు