టాయిలెట్స్ లోనూ సీసీ కెమెరాలు..! అది పెట్టడానికి అసలు కారణం తెలుస్తే షాక్.!

ప్రస్తుతం మనం ఎక్కడికి వెళ్లినా సీసీ కెమెరాలు కనిపిస్తూనే ఉన్నాయి.ఆఫీస్ లో, స్కూల్స్ లో, హోటల్స్ లో.

! సిటీలోని రోడ్స్ లో కూడా చూస్తూనే ఉన్నాము.కానీ బాత్రూం లో కూడా సీసీ కెమెరా పెట్టారు.

వివరాల్లోకి వెళ్తే.!

అదొక డిగ్రీ కాలేజే.చాలా పేరున్న కాలేజీ.ఈ కాలేజీ ఎంతో మంది ప్రముఖులును ఈ దేశానికి అందించింది.

Advertisement

అలాంటి కాలేజీలో ఇప్పుడు ఓ విడ్డూరం.కాలేజీ మేనేజ్ మెంట్ తీసుకున్న ఓ నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెరలేపింది.

విద్యార్థులు (అబ్బాయిలు) టాయిలెట్స్ లో సీసీ కెమెరాలు పెట్టడం.ఇదేమి విడ్డూరం.

వాళ్లకేం పని అక్కడ అనే డౌట్ ఠక్కున వస్తుంది.మేనేజ్ మెంట్ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం కూడా వ్యక్తం అవుతోంది.

అబ్బాయిల టాయ్ లెట్స్ లో ఈ సీసీ కెమెరాలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలిగఢ్ లోని ధరమ్ సమాజ్ డిగ్రీ కాలేజీ.

షారుఖ్ ఖాన్ ఎందుకు సౌత్ డైరెక్టర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు..?
వీధి ఆవులకు రొట్టెలు పెడుతున్న మహిళ.. వీడియో చూస్తే ఫిదా..

పరీక్షలో విద్యార్థులు కాపీ కొడుతున్నారని మేనేజ్ మెంట్ దృష్టికి వచ్చింది.ఎంత కంట్రోల్ చేసినా కాపీలు మాత్రం ఆగటం లేదు.

Advertisement

దీంతో క్యాంపస్ లో సీసీ కెమెరాలు పెట్టాలని మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకుంది.ఇక్కడి వరకు బాగానే ఉన్నా.

టాయిలెట్స్ లోనూ సీసీ కెమెరాలు పెట్టడంతో అందరూ నోరెళ్లబెడుతున్నారు.కొంత మంది కొంటెకుర్రోళ్లు అయినా.

టాయ్ లెట్ లోని సీసీ కెమెరాల వైపు చూస్తు వికృత చేష్టలు కూడా చేస్తున్నారంట.మేనేజ్ మెంట్ నిర్ణయంపై సెటైర్లతో విచుకుపడుతున్నారు.

మరోవైపు టాయిలెట్స్ లో సీసీ కెమెరాలు పెట్టడాన్ని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ హేమ్ ప్రకాశ్ గుప్తా సమర్థించుకున్నారు.పరీక్షల్లో విద్యార్థులు చీట్ చేస్తున్నారని, దాన్ని అరికట్టేందుకే టాయిలెట్లలో సీసీ కెమెరాలు పెట్టినట్టు చెబుతున్నారు.టాయిలెట్లలో పుస్తకాలు పెట్టి.

అక్కడి నుంచి చిట్టీలు తెస్తున్నారని చెబుతున్నారు.ఎన్నిసార్లు కంట్రోల్ చేసినా ఎగ్జామ్స్ లో చిటీలు తగ్గటం లేదని.

అందుకే టాయిలెట్స్ లోనూ సీసీ కెమెరాలు పెట్టాం అని సగర్వంగా చెబుతున్నారు ప్రిన్సిపాల్.అయితే ఈయన సమాధానాన్ని విద్యార్థులు కొట్టిపడేస్తున్నారు.

తాజా వార్తలు