వివేకా హత్య కేసులో నాలుగో రోజు ముగిసిన సీబీఐ కస్టడీ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి నాలుగో రోజు సీబీఐ కస్టడీ ముగిసింది.

ఇవాళ సుమారు ఆరు గంటల పాటు ఇరువురిని సీబీఐ అధికారుల ప్రశ్నించారు.వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు పరిణామాలపై ఆరా తీశారు.

అదేవిధంగా రేపు ఇద్దరినీ మరోసారి సీబీఐ కస్టడీలోకి తీసుకోనుంది.మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ తరువాతనే ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంది.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు