బర్త్ డే స్పెషల్: అదరగొడతున్న క్యాథరిన్ .. ఒకేసారి నాలుగు సినిమాలు

నటి కేథరిన్‌ థ్రెసా( Catherine Tresa ) తన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసింది.ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, బింబిసార, మాచర్ల నియోజకవర్గం, వాల్తేరు వీరయ్య సినిమాల్లో ఈ క్యూట్ బ్యూటీ కీలకమైన రోల్స్ పోషించి ఆకట్టుకుంది.

వీటి కంటే ముందు చాలా సినిమాల్లో హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా చేసింది కానీ ఆమె రష్మిక, సంయుక్త మీనన్‌, సమంత, కీర్తి సురేష్ లాగా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.2023 తర్వాత కేథరిన్‌ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.దాంతో ఈ అందాల తారగా కెరీర్ ముగిసిందని చాలామంది అనుకుంటున్నారు.

ఇలాంటి సమయంలో కేథరిన్‌ థ్రెసా అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈరోజు ఈ ముద్దుగుమ్మ తన పుట్టినరోజు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా ఆమె అప్‌కమింగ్ మూవీస్‌కి సంబంధించిన అప్‌డేట్స్‌ వచ్చాయి.

దాదాపు రెండేళ్ల పాటు కామ్ గా ఉన్న ఈ తార ఒకేసారి నాలుగు సినిమాలకు సైన్ చేసి ఫ్యాన్స్‌కి బీభత్సమైన ఆనందాన్ని కలిగించింది. వి.ఎన్ ఆదిత్య( V.N.Aditya i) డైరెక్ట్‌ చేస్తున్న ఒక కొత్త సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపిక అయింది.ఆమె బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని డైరెక్టర్ ఆదిత్యనే తెలిపాడు.

Advertisement

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అమెరికాలో జరుగుతోంది.ఆ షూటింగ్‌లో కేథరిన్ పాల్గొంటుంది.

అయితే ఆమె బర్త్‌ డేను అక్కడే సెలబ్రేట్ చేశారు.కేథరిన్‌ చేతిలో ఒక కోలీవుడ్ మూవీ కూడా ఉంది.

ఈ మూవీ షూటింగ్ 50% కంప్లీట్ అయింది.ఈ మూవీ తీస్తున్న తమిళ దర్శకుడు ఆమెతో చేస్తున్న సినిమాని త్వరలోనే ప్రకటించనున్నాడని సమాచారం.

బింబిసార( Bimbisara ) తర్వాత ఈ అందాల తార బాలీవుడ్ లో కూడా బాగా పేరు తెచ్చుకుంది.అందుకే అక్కడ ఆమెకు చాలా ఆఫర్లు వస్తున్నాయని సమాచారం.ప్రస్తుతానికి ఈ బ్యూటీ రెండు బాలీవుడ్ సినిమాలకి సైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

అలా రెండేళ్లు పాటు గ్యాప్ తీసుకున్న కేథరిన్‌ ఇప్పుడు ఒకేసారి నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టింది.విఎన్ ఆదిత్య మనసంతా నువ్వే, నేనున్నాను, బాస్ వంటి మంచి లవ్ స్టోరీ సినిమాలు తీశారు.

Advertisement

కేథరిన్‌ థ్రెసాతో కూడా అలాంటి ఒక లవ్ స్టోరీ చేస్తే అది సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది.అదే జరిగితే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ అవ్వాలనే తన కలను కంపల్సరీగా నెరవేర్చుకుంటుంది.

ఈ అప్‌కమింగ్ మూవీస్ త్వరగా పూర్తి కావాలని ఫ్యాన్స్ బాగా కోరుకుంటున్నారు కూడా.

తాజా వార్తలు