టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు

టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదైంది.అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీస్ స్టేషన్ కేసు రిజిస్ట్రర్ అయినట్లు తెలుస్తోంది.

ఇటీవల తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో జరిగిన ఘర్షణల నేపథ్యంలో హత్యాయత్నంతో పాటు నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు పోలీసులు.ఇందులో ఏ1గా చంద్రబాబు, ఏ2 గా దేవినేని ఉమ, ఏ3 గా అమర్నాథ్ రెడ్డి, ఏ4 గా రామ్ భూపాల్ రెడ్డిలు ఉన్నారు.

ఈ దాడి ఘటనలో మొత్తం 20 మంది టీడీపీ నేతలపై కేసు నమోదైంది.చంద్రబాబు, ఇతర నేతలు మారణాయుధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రాజెక్టుల సందర్శన పేరుతో కార్యకర్తలను రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారని ఆరోపించారు.ఈ క్రమంలోనే వైసీపీ నేత ఉమాపతి రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం.

Advertisement
అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?

తాజా వార్తలు