లక్నో జట్టు ఓటమిపై స్పందించిన కేఎల్ రాహుల్.. నెటిజన్స్ విమర్శక కామెంట్స్..!

తాజాగా లక్నో - పంజాబ్( LSG vs PBKS ) మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు ఓటమిని చవిచూసింది.

అయితే దీనిపై లక్నో జట్టు కెప్టెన్ రాహుల్( KL Rahul ) స్పందిస్తూ.

ఢిల్లీ జట్టుపై తమ ఆటగాళ్లు బాగా రాణించారని, అదే రీతిలో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఆడి ఉంటే కచ్చితంగా స్కోరు 180 - 190 చేసే వాళ్లమని తెలిపాడు.తమ బ్యాటర్లు బౌండరీ లైన్లో వద్ద ప్రత్యర్థి ఫిల్డర్ల చేతికి క్యాచ్లు ఇచ్చి అవుట్ అయిపోయారు.

అలా జరగకపోయి ఉంటే తమ జట్టు భారీ స్కోరు చేసి ఉండేదని తెలిపాడు.

అయితే ఆటలో గెలుపు ఓటములు సహజం.తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని తదుపరి మ్యాచ్ లలో ఆటలో మెరుగైన ప్రదర్శనను కనబరుస్తామని తెలిపాడు.మొదట టాస్ ఓడిన లక్నో జట్టు బ్యాటింగ్ చేసింది.

Advertisement

కేఎల్ రాహుల్ 56 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 76 పరుగులు చేయగా.కైల్ మేయర్స్( Kyle Mayers ) 29 పరుగులు చేశాడు.

బ్యాటర్లు చెప్పుకోదగ్గ పరుగులు చేయలేక పోవడంతో లక్నో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.తరువాత లక్ష్య చేదనకు పంజాబ్ ఆరంభంలో కాస్త తడబడిన కూడా ఆఖరి ఓవర్ వరకు పోరాడి మూడు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

మ్యాచ్ అనంతరం రాహుల్ మాట్లాడుతూ ఈ మ్యాచ్లో సమిష్టి వైఫల్యం కారణంగా తమ జట్టు పరాజయం అయిందని తెలిపాడు.అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం హాఫ్ సెంచరీ సమయానికి రాహుల్ స్ట్రైట్ రేటు పై వరుసగా విమర్శిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.రాహుల్ కేవలం ఆరెంజ్ క్యాప్ కోసం మాత్రమే పోటీ పడుతున్నాడని విమర్శిస్తూ ఉంటే.

రాహుల్ కెప్టెన్ గా, బ్యాటర్ గా అరుదైన రికార్డులు సృష్టిస్తున్న నేపథ్యంలో ఓర్వలేక ఇలా చెత్త కామెంట్లు చేస్తున్నారని కొంతమంది అభిమానులు మండిపడుతున్నారు.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు