Rashmika Mandanna : ఆ విషయంలో ఏకంగా అల్లు అర్జున్ ను వెనక్కి నెట్టేసి టాప్ 3 లో నిలిచిన రష్మిక..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన( Rashmika Mandanna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతోంది రష్మిక.

 Imdb Popular Indian Celebrities Rashmika In Top Three-TeluguStop.com

ఇక 2021 లో విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా కూడా మారిన విషయం తెలిసిందే.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ హిందీలో కూడా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.

అంతేకాకుండా నేషనల్ క్రష్( National Crush ) గా కూడా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తోంది.

Telugu Allu Arjun, Imdb, Indian, National Crush, Pushpa, Tollywood-Movie

దానికి తోడు రష్మిక నటించిన సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధిస్తుండడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది.ఇటీవల ఈమె తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే.సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా( Social Media )లో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక మందనకి సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.

ఒక విషయంలో రష్మిక మందన స్టార్ హీరో అయినా అల్లు అర్జున్ వెనక్కి నెట్టేసి మరి టాప్ త్రీ లో నిలిచింది.పూర్తి వివరాల్లోకి వెళితే.తాజాగా రష్మిక ఒక సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది.

Telugu Allu Arjun, Imdb, Indian, National Crush, Pushpa, Tollywood-Movie

సినిమాలను విశ్లేషించి ర్యాంకులు ఇచ్చే ఐఎండీబీ( IMDB Survey )లో ఈ వారం కొత్తగా చేరిన సెలబ్రిటీల జాబితాలో టాప్‌ 3లో నిలిచింది.ఇటీవలే అల్లు అర్జున్ బర్త్‌డే సందర్బంగా పుష్ప2 గ్లింప్స్‌( Pushpa 2 Glimpse ) విడుదల కావడంతో రష్మిక గురించి సోషల్ మీడియా( Social Media )లో ప్రతి ఒక్కరు మాట్లాడుకునేలా చేశాయి.ఈ విషయాన్ని తెలియజేస్తూ ఐఎండీబీ తన ట్విటర్‌ వేదికగా ర్యాంకులను విడుదల చేసింది.

రష్మిక తొలిసారి టాప్‌ 3లోకి రావడం ఆనందించాల్సిన విషయం.కొత్త జాబితాలో 11వ స్థానంలో తమిళ దర్శకుడు వెట్రిమారన్‌, ఉండగా పుష్ప సినిమాతో జాతీయస్థాయిలో పేరుతెచ్చుకున్న అల్లు అర్జున్‌ 17వ స్థానంలో నిలిచారు.

ఆ తర్వాత మృణాల్‌ ఠాకూర్‌ 31వ స్థానం, తమన్నా 33వ స్థానం, కరీనా 34 వ స్థానం, నాని 49వ స్థానం, కీర్తి సురేశ్‌ 55వ స్థానంలో నిలిచారు.రష్మిక మందన సినిమాల విషయానికి వస్తే.

ప్రస్తుతం అల్లు అర్జున్తో కలిసి పుష్ప 2 సినిమాలో నటిస్తోంది.దాంతోపాటుగా తెలుగు తమిళ భాషల్లో రెయిన్ బో సినిమాలో నటిస్తోంది.

అలాగే నితిన్‌ వెంకీ కుడుముల సినిమా హిందీలో యానిమల్‌ చిత్రాలో కూడా నటిస్తోంది రష్మిక.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube