పవన్ లో ఈ మార్పు ఊహించలేదే ? 

జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి.

  గతంలో మాదిరిగా ఆయన వ్యవహారం లేదు.

  పూర్తిగా పరిపాలనపైనే దృష్టి సారించారు.గతంలో ఉన్న ఆవేశం, ప్రత్యర్థులపై విమర్శలు వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు.

కేవలం తనకు సంబంధించిన శాఖల వ్యవహారంపైనే పూర్తిగా ఫోకస్ చేశారు.దీంతో పవన్ మారిపోయారని, గతంలో ఎప్పుడు చూడని సరికొత్త పవన్ కళ్యాణ్ ను ఇప్పుడు చూస్తున్నామని ఆయన అభిమానులు ,జనసైనికులు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానిస్తున్నారు.

  పవన్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించి నెలరోజులు మాత్రమే అవుతున్నప్పటికీ,  ఆయన తన శాఖల పై పూర్తిగా పట్టు సాధించేందుకు తరచుగా సమీక్షలు నిర్వహిస్తూ,  తన శాఖలకు సంబంధించిన అంశాల పైన అధ్యయనం చేస్తున్నారు .అనేకసార్లు మంత్రులుగా చేసిన వారు సైతం పవన్ స్థాయిలో శాఖలపై ఎప్పుడు ఫోకస్ చేయలేదనే విషయమూ చర్చకు వస్తోంది.

Advertisement

 పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలను పవన్ తీసుకోవడంతో అవి తనకు బాగా కలిసి నచ్చిన అంశాలు కూడా కావడంతో పూర్తిగా ఆ శాఖలపైనే ఫోకస్ చేశారు మిగతా రాజకీయ అంశాలను పెద్దగా పట్టించుకోవడం లేదు.తన శాఖలో,  తన వద్దకు చర్చకు వచ్చిన సమస్యలను మాత్రమే పరిష్కరించుకుంటూ వెళ్తున్నారు .పవన్ ను కలిస్తే ఎంతటి పెద్ద సమస్య అయినా పరిష్కారం అవుతుందని జనాల్లోనూ నమ్మకం ఏర్పడింది.అందుకే పవన్ కలిసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు.

  ఏపీలో జరుగుతున్న మిగతా ఘటన విషయంలోను స్పందించడం లేదు.గతంలో రాజకీయ విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాటి జోలికి వెళ్లడం లేదు.

పార్టీ కార్యకర్తలకు కూడా సోషల్ మీడియా( Social media )లో విపక్షాల పైన విపక్ష నేతలకు సంబంధించిన వ్యక్తిగత అంశాల పైన స్పందించ వద్దంటూ పవన్ సూచిస్తున్నారు.

తాను తన శాఖ అభివృద్ధి , సమస్యల పరిష్కారం వంటి వాటిపై ఎక్కువ ఫోకస్ చేశారు దీంతో పాటు తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ( Pithapuram Assembly constituency )అభివృద్ధి పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఇదిలా ఉంటే పవన్ ఎక్కువగా పిఠాపురంలో లేదా విజయవాడలోని ఉంటూ పార్టీ కార్యక్రమాలు అన్నిటిని నాదెండ్ల మనోహర్,  నాగబాబు వంటి వారికి అప్పగించేశారు.సీఎం చంద్రబాబుతో భేటీ అయినా తన శాఖలకు సంబంధించిన అంశాలపైనే పవన్ చర్చిస్తున్నారు.

కేటీఆర్ హరీష్ మధ్య ' మంట ' రాజేస్తున్న రేవంత్
Advertisement

తాజా వార్తలు