కెనడా ఎన్నికలు: మళ్లీ కింగ్‌మేకర్‌గా జగ్మీత్ సింగ్.. 2019 సీన్ రిపీట్ అవుతుందంటున్న సర్వేలు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఆయా దేశాల్లో కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.

భారత సంతతి క్రమంగా పెరగడంతో అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకున్నారు .

ఉదాహరణకు అమెరికాను తీసుకుంటే ఈ గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు క్రమంగా ఇక్కడి సమాజంలో కీలక స్థానాన్ని ఆక్రమించారు.అన్ని రంగాల్లో దూసుకెళ్తూ స్థానిక అమెరికన్లతో పాటు అగ్రరాజ్యంలో స్ధిరపడిన మిగిలిన విదేశీయులకు పోటీ ఇస్తున్నారు.

ఇక ఎన్నికల్లో భారతీయుల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పెన్సిల్వేనియా, జార్జియా, ఫ్లోరిడా, మిచిగాన్, టెక్సాస్‌, నార్త్ కరోలినా తదితర కీలక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో స్థిరపడిన ఇండో అమెరికన్లు అభ్యర్ధుల విజయాలను శాసిస్తున్నారు.

అందుకే వీరి కరుణ కోసం రిపబ్లికన్లు, డెమొక్రాట్లు తెగ తపిస్తుంటారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలు- 2020లో భారతీయుల హవా స్పష్టంగా కనిపించింది.

Advertisement

ఈ పరిస్ధితి ఒక్క అమెరికాలోనే కాదు.బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా ఇలా చాలా దేశాల్లో కింగ్ మేకర్లుగా ప్రవాసులు వున్నారు.

మరికొద్దిరోజుల్లో కెనడాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయులు తమ స్టామినా ఏంటో చూపించేందుకు సిద్ధమవుతున్నారు.దీంతో ఇండో - కెనడియన్లను ప్రసన్నం చేసుకునేందుకు అక్కడి రాజకీయ పార్టీలు రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి.

ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది న్యూ డెమొక్రటిక్ పార్టీ (ఎన్‌డీపీ) నేత, భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్ గురించే.కెనడా రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో జగ్మీత్ ఒకరు.

అతని నాయకత్వం, ప్రభావం, రాజకీయాలు ఒక్క భారతీయ సమాజానికే పరిమితం కాలేదు.ఇతనికి కెనడాలోనే జనాభా పరంగా అతిపెద్ద ప్రావిన్సులైన బ్రిటీష్ కొలంబియా, అంటారియోలలో గట్టి పట్టుంది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

మొత్తం కెనడా జనాభాలో భారతీయులు కేవలం 4 శాతం మంది మాత్రమే వున్నారు.అయితే వారి ఓట్లు మాత్రం కీలకమన్నది సుస్పష్టం.

Advertisement

అంటారియో, బ్రిటీష్ కొలంబియా, అల్బెర్టా, మానిటోబా వంటి ప్రావిన్సులలో భారతీయుల ప్రభావం వుంది.

తాజాగా వెలువడుతున్న సర్వేల ప్రకారం.జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమొక్రాటిక్ పార్టీ మరోసారి కింగ్ మేకర్ అయ్యే అవకాశం వుందని తెలుస్తోంది.తాజా పరిణామాలు లిబరల్స్, కన్జర్వేటివ్స్ మధ్య హోరాహోరి పోరు సూచిస్తున్నందున.రెండు ప్రధాన పార్టీలు మెజారిటీ పొందలేకపోతే చిన్న పార్టీల మద్ధతు అవసరం.2019లో జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీకీ 157 సీట్లు వచ్చాయి.338 మంది సభ్యులున్న హౌస్ ఆఫ్ కామన్స్‌లో అధికారాన్ని అందుకోవడానికి ట్రూడోకి 13 మంది సభ్యుల మద్ధతు కావాలి.అటు కన్జర్వేటివ్స్‌కు 121 సీట్లు వచ్చాయి.

జగ్మీత్ సారథ్యంలోని ఎన్‌డీపీ 24 స్థానాలు గెలుచుకుంది.దీంతో జగ్మీత్ మద్ధతుతో ట్రూడో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.

అయితే తన మైనారిటీ ప్రభుత్వాన్ని మెజారిటీగా మార్చడానికి.కోవిడ్ 19పై తాను సమర్థవంతంగా పనిచేశాననే నమ్మకంతో ట్రూడో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.

అయితే ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం ట్రూడో వ్యూహం ఫలించే అవకాశం లేదని తెలుస్తోంది.ప్రధానంగా హౌసింగ్ ధరలు ఆకాశాన్ని తాకడం ట్రూడోకు దెబ్బకు పరిణమిస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి.

అటు కన్జర్వేటివ్ నేత ఎరిన్ ఓ టూలేకు యువ ఓటర్లు దన్నుగా వున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.ఇదే సమయంలో ఎన్‌డీపీకి బ్రిటీష్ కొలంబియా, అంటారియోలలో మంచి పట్టుంది.

ఇక్కడ భారత సంతతి, దక్షిణాసియా వర్గాల నుంచి జగ్మీత్‌కు మద్ధతు లభిస్తోంది.ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం.

ఎన్‌డీపీకి గతంలో (24) కంటే ఎక్కువ సీట్లు లభించవచ్చట.కెనడాలో స్థిరపడిన భారతీయ ప్రవాసులు సంపన్నులు మాత్రమే కాకుండా విద్యావంతులై వున్నందున తమకు అండగా వుండేవారిని కోరుకుంటారు.

ఒక సమూహంగా భారత సంతతి ముఖ్యంగా సిక్కులు దేశ రాజకీయ రంగంలో శక్తివంతమైన వర్గంగా తయారయ్యారు.సెప్టెంబర్ 20న జరగనున్న ఎన్నికల్లో 47 మంది పంజాబీ ఎన్‌ఆర్ఐలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇండియా నుంచి నేరుగా విమాన సౌకర్యం లేకపోవడం, జాత్యహంకార దాడులు, అధిక గృహ వ్యయం వంటి సమస్యలను లేవనెత్తుతున్నారు.డైరెక్ట్ ఫ్లైట్‌పై నిషేధం కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన చాలా మంది ఇండో కెనడియన్లు ఈసారి ఓటు వేసే అవకాశం లేదు.

తాజా వార్తలు