ఢిల్లీ పీఠం పై కేసీఆర్ గురి ? ' బంగారు ' కల తీరేనా ? 

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ తగ్గించినట్లు కనిపిస్తున్నారు.పూర్తిగా ఢిల్లీ రాజకీయం పైన ఆయన దృష్టి పెట్టారు.

జాతీయ స్థాయిలో బీజేపీ పై వ్యతిరేకత పెంచడంతోపాటు,  టిఆర్ఎస్ పేరు దేశవ్యాప్తంగా మారు మోగే ఈ విధంగా చేయాలని చూస్తున్నారు.బిజెపి,  కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో ప్రత్యేక కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

దీనికోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని వెళ్లే విధంగా రాజకీయ చర్చలు మొదలుపెట్టారు.దీనిలో భాగంగానే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమావేశం అవుతున్నారు.

కొద్దిరోజుల క్రితమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తో కేసీఆర్ భేటీ అయ్యారు.  ఆ తర్వాత వెంటనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తోనూ ఆయన సమావేశమయ్యారు.

Advertisement

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయం గా ప్రాంతీయ పార్టీల కూటమిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయంపై చర్చలు జరిపారు.ప్రాంతీయ పార్టీల కూటమి లోకి ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్ చేరకుండా చూడాలనేది కెసిఆర్ ప్రయత్నం గా కనిపిస్తోంది.

ఇక కేసీఆర్ నాయకత్వాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, శరద్ పవార్, లెఫ్ట్ పార్టీలు సమర్ధిస్తున్నాయి.అయితే ఎన్నికల సమయం నాటికి ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కేసీఆర్ కు ఎంతవరకు సహకరిస్తాయి అనేది సందేహమే. 

గతంలో బంగారు తెలంగాణ నినాదాన్ని వినిపించిన కేసీఆర్.ప్రస్తుతం బంగారు భారతదేశం అంటూ కొత్త నినాదాన్ని అందుకున్నారు.అమెరికా వంటి అగ్ర దేశాలు భారత్ కు వచ్చేలా చేస్తాను అంటూ కేసిఆర్ చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఏకం చేసి బిజెపికి వ్యతిరేకంగా పని చేసేలా చేస్తామని కెసిఆర్ ప్రతిజ్ఞలు చేస్తున్నారు.కాంగ్రెస్ , బిజెపిలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల కూటమిని తన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లి , ఢిల్లీ పీఠాన్ని సాధించాలనేదే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోంది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
వైరల్ వీడియో : కొత్త స్టైల్ లో ఇంట్లో చోరీలకు తెగబడ్డ దొంగలు..

దీనికోసమే తెలంగాణ రాజకీయాలను సైతం పక్కనపెట్టి దేశ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. 

Advertisement

అయితే ఈ ప్రాంతీయ పార్టీల కూటమి కెసిఆర్ నాయకత్వంలో ముందుకు వెళుతుందా ? దీనికి ఎవరు నాయకత్వం వహిస్తారు ? ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు అనేది మార్చి 3వ తేదీన వారణాశి లో జరిగే ర్యాలీలో తేలిపోనుంది.అయితే కేసీఆర్ మాత్రం టిఆర్ఎస్ నే ఈ ప్రాంతీయ పార్టీల కూటమిలో కీలకమని తన నాయకత్వంలోనే అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

తాజా వార్తలు