తెలుగుదేశం పార్టీలో కాస్త అయోమయం నెలకొన్నట్లు కనిపిస్తుంది.పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచనలపై పార్టీ నేతల్లో కాస్త అసంతృప్తి ఉండట.
తెలుగుదేశం పార్టీ అధినేతగా సరియైన నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ విషయంపై తెలుగు తమ్ముళ్ళే చెవులు కొర్కుంటున్నారు.
తన 40 ఏళ్ల అనుభవంతో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన చంద్రబాబు చాలా విషయాల్లో దైర్యం చేయలేకపోతున్నారని టీడీపీ నేతలు అనుకుంటున్నారు.అధికార పార్టీ వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంలో ఆయన కేడర్ సిద్దం చేయడంలో విఫలమయ్యారనే వాదన వినిపిస్తుంది.
తాజాగా పవన్ వైసీపీపై చేస్తున్న పోరాట తీరును చూసి చంద్రబాబు నెర్చుకోవాలని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని చంద్రబాబు తమ పార్టీ కార్యకర్తలను, నేతలను ఆదేశించారు.
కానీ ఎలా అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వకపోవడంపై పార్టీ కేడర్ అయోమయంలోకి వెళ్ళింది. దీన్నిబట్టి చూస్తే పార్టీ పెద్దలు చంద్రబాబును సీరియస్‌గా తీసుకోవడం లేదంటున్నారు.దూకుడు ఉండాల్సిన చోట సైలెంట్‌గా ఉండడం పార్టీకి నష్టం కలిగించే అంశమే అంటున్నారు.
చంద్రబాబు పరిస్థితే ఇలా ఉంటే లోకేష్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది.

ఆయన నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితిలో పార్టీ నేతలు లేరు.వారసత్వ రాజకీయంతో లోకేష్ పార్టీ నాయకత్వాన్ని వారసత్వంగా పొందవచ్చు కానీ ప్రతిభతో కాదని పార్టీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సరైన నాయకత్వం లేకపోవడం టీడీపీని కలవరపెడుతోంది.
ప్రస్తుతం అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను టీడీపీ క్యాష్ చేసుకోలేకపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇలానే వ్వవహరిస్తే 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ ప్రతిపక్షంగా ఉండాల్పి వస్తుందని అంటున్నారు.మరి తెలుగు తమ్ముళ్ళ మాట విని చంద్రబాబు ఇకనైనా మారుతారా? లేక ఎప్పటిలాగే ఉంటూ పార్టీని మరిన్ని కష్టాల్లో పడేస్తారా? అనేది చూడాలి.