ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా తెలంగాణలో అభివృద్ధి ఆగదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకుడిగా మాట్లాడటం సరికాదన్నారు.
జీఎస్టీ తాము కడితే ఫలాలు మాత్రం గుజరాత్ కా అని ప్రశ్నించారు.ప్రధాని పర్యటన రాజకీయాలకే పరిమితమైందని తెలిపారు.
ఢిల్లీ పాలకులకు తెలంగాణపై వివక్ష ఎందుకని ప్రశ్నించారు.అదేవిధంగా ఆంధ్ర పార్టీలకు తెలంగాణలో ఏం పని అని నిలదీశారు.
సమైక్య పాలనలో తెలంగాణ సంపదను దోచుకున్నారని విమర్శించారు.మళ్లీ దోచుకునేందుకే తెలంగాణకు వస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఆంధ్రా పార్టీలకు తెలంగాణలో ఒక్క ఓటు కూడా పడదని స్పష్టం చేశారు.







