క్రిష్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇటీవలే చాలా గ్యాప్ తర్వాత పునః ప్రారంభం అయిన విషయం తెలిసిందే.ఏకధాటిగా సినిమా షూటింగ్ కొనసాగించి పూర్తి చేస్తామంటూ దర్శకుడు క్రిష్ ఆ మధ్య ప్రకటించాడు.
కానీ 10 నుండి 15 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడో లేదో పవన్ కళ్యాణ్ అప్పుడే రాజకీయాల పని మీద అమరావతి మరియు వైజాగ్ అంటూ తెగ తిరిగేస్తున్నాడు.తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ వైజాగ్ పర్యటన నేపథ్యం లో పవన్ కళ్యాణ్ వెళ్లిన విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోడీ తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.ఆ సందర్భం గా పవన్ కళ్యాణ్ లుక్ చూస్తే వీరమల్లు సినిమా కోసం రెడీ అన్నట్లుగా ఉన్నాడు అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ తో భేటీ తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్ వచ్చి షూటింగ్ కార్యక్రమాలకు హాజరవుతాడని కొందరు భావించారు.కానీ ఆయన జనసేన పార్టీ నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అనేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.దాంతో హరిహర వీరమల్లు షూటింగ్ కోసం మళ్లీ ఎప్పటికీ హైదరాబాదు లో పవన్ కళ్యాణ్ ల్యాండ్ అవుతాడు అంటూ ఆయన అభిమానులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.హరిహర వీరమల్లు సినిమా ను ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ వారం రోజులు షూటింగ్ జరిగితే నెల రోజులు షూటింగ్ ఆగి పోతుంది.
మొత్తానికి ఈ వ్యవహారం అంతా కూడా చాలా చిరాకుగా అనిపిస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.హరి హర వీరమల్లు సినిమా ను వచ్చే సంవత్సరం వేసవి కానుకగా విడుదల చేయాలని దర్శకుడు క్రిష్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
మరి అది సఫలం అయ్యేనా చూడాలి.







