పంజాబ్‌లో వ్యాపారి హత్య.. అమెరికాలోని ఎన్ఆర్ఐ ప్రమేయం, పాతకక్షలతో దారుణంగా

పంజాబ్‌( Punjab )లోని అమృత్‌సర్ నగర శివార్లలో ఓ పాల వ్యాపారి దారుణహత్య కలకలం రేపుతోంది.

ఈ ఘటన వెనుక ఓ ఎన్ఆర్ఐ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

గురువారం సాయంత్రం జండియాలగురు పోలీస్ స్టేషన్ పరిధిలోని తారాగఢ్ తలావాన్ గ్రామ సమీపంలో పాల వ్యాపారి కుల్బీర్ సింగ్‌ను( Kulbir Singh ) ఇద్దరు సాయుధులైన దుండగులు కాల్చి చంపారు.పాత కక్షలే ఈ హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

మృతుడి తండ్రి అమ్రిక్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు.కాంట్రాక్ట్ కిల్లర్స్ ద్వారా నిందితులు తమ కొడుకును హతమార్చారని అమ్రిక్ తన ఫిర్యాదులో ఆరోపించారు.

స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై డీఎస్పీ రవీందర్ సింగ్ ( DSP Ravinder Singh )మీడియాతో మాట్లాడుతూ.నిందితులను పట్టుకునేందుకు పోలీస్ సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.మరోవైపు ఈ కేసులెో అనుమానితులుగా అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ జగ్రూప్ సింగ్ అలియాస్ జగ్గా.

Advertisement

తర్న్‌తరణ్‌లోని తఖ్తుచక్ గ్రామానికి చెందిన వారింగ్ సింగ్, సుఖా సింగ్‌‌గా గుర్తించి వారిపై పలు సెక్షన్ల కేసులు నమోదు చేశారు.

2011లో మృతి చెందిన దల్జీత్ కౌర్ మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు నిందితులు కుల్బీర్ సింగ్‌ను హత్య చేశారని అతని తండ్రి ఆరోపిస్తున్నాడు.దల్జీత్ చావుకు సంబంధించి కుల్బీర్ సింగ్‌పై కేసు నమోదైనప్పటికీ, రెండేళ్ల తర్వాత అతనిని కోర్ట్ నిర్దోషిగా విడుదల చేసింది.అమృత్‌సర్‌లోని ఓ హోటల్‌లో పనిచేసే తన కుమార్తె దల్జీత్ కౌర్‌తో కుల్బీర్‌కు అక్రమ సంబంధం ఉందని కశ్మీర్ సింగ్ కుటుంబం అనుమానించేది.

ఈ క్రమంలోనే 2011లో దల్జీత్ ప్రాణాలు కోల్పోయింది.ధరద్ గ్రామానికి చెందిన కుల్బీర్ సింగ్ (40) రోజూ మాదిరిగానే కస్టమర్లకు పాలు పంపిణీ చేసి తన కారులో ఇంటికి తిరిగి వస్తున్నాడు.

ఈ క్రమంలో తారాగఢ్ తలావాన్ గ్రామం వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకులు అతని కారును ఆపి విచక్షణారహితంగా కాల్పులకు దిగారు.ఈ ఘటనలో కుల్బీర్ తల, భుజంలోకి బుల్లెట్లు దూసుకెళ్లి అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, శుక్రవారం 2024
Advertisement

తాజా వార్తలు