బిగ్ బాస్ హారికకు బంపర్ ఆఫర్... అదేంటంటే?

దేత్తడి హారికగా సోషల్ మీడియా స్టార్ గా నెటిజన్ల ప్రశంసలు అందుకున్న హారిక.బిగ్ బాస్ కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

తనదైన ఆటతీరుతో బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెలిచి, ఒక్కొక్క్కరిని ఓడిస్తూ, బిగ్ బాస్ టాప్ 5కు చేరింది.బిగ్ బాస్ విజేత కాలేకపోయినా ప్రేక్షకుల మదిలో ఓ ముద్ర వేసుకున్నారని చెప్పవచ్చు.

అయితే అవకాశాలు అనేవి ఎప్పుడు ఎలా వస్తాయనేది ఎవ్వరు ఊహించలేరు.మనం మన వ్యక్తిగత జీవితపు గెలుపు మనల్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్తుందనేది బిగ్ బాస్ హారిక విషయంలో రుజువయిందని చెప్పవచ్చు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ టూరిజం కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రభుత్వం నియమించింది.తెలంగాణ పర్యాటక ప్రాంతాలకు మరింత ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో బ్రాండ్ అంబాసిడర్ గా హారికను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

ఈ సందర్బంగా ఈ విషయాల్ని హారిక సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఇక మనమందరం కలిసి ముందడుగు వేద్దాం అని హారికను తెలియజేస్తూ, తాను ఉత్తర్వులు అందుకుంటున్న ఫోటోను హారిక షేర్ చేసింది.

ఇక హారికను తన అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు