టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సుమ కనకాల( Suma Kanakala ) ఒకరు.సుమా కుమారుడిగా రోషన్( Roshan ) అందరికీ ఎంతో సుపరిచితమే.
ఇలా సుమ రాజీవ్ కనకాల ( Rajeev Kanakala ) కుమారుడిగా గుర్తింపు పొందినటువంటి రోషన్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.రవికాంత్ పేరేపు బబుల్ గమ్ ( Bubble gum ) చిత్రానికి దర్శకత్వం వహించారు.
మానస చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరీ మూవీస్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.
ఇక ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.థియేటర్లో విడుదలైనటువంటి ఈ సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలను చేరుకోలేకపోయినప్పటికీ రోషన్( Roshan ) నటన మాత్రం అందరిని ఆకట్టుకుందని చెప్పాలి.ఇలా రోషన్ హీరోగా మంచి మార్కులే సంపాదించుకున్నారు.
ఇలా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేసినటువంటి ఈ సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది.
బబుల్ గమ్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా( Aha ) కొనుగోలు చేశారు.ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఆహా ఇటీవల అధికారక ప్రకటన తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు.ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఆహాలో ప్రసారం కానుందని తెలిపారు.
థియేటర్లలో పెద్దగా మెప్పించలేకపోయినటువంటి ఈ సినిమా డిజిటల్ మీడియాలో ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాని థియేటర్లో మిస్సయిన వారందరూ కూడా ఆహాలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.