లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ టికెట్ల( Telangana Congress MP Tickets ) కోసం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది.గడువు ముగిసే సమయానికి సుమారు మూడు వందలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని తెలుస్తోంది.
రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీకి( Congress Party ) చెందిన మూడు వందల మందికి పైగా ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు.చివరి రోజు కావడంతో ఇవాళ ఒక్కరోజే 160 కి పైగా దరఖాస్తుల వచ్చాయని తెలుస్తోంది.దీనిలో ఖమ్మం పార్లమెంట్ సీటు కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని విక్రమార్క,( Nandini Vikramarka )
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డితో( Prasad Reddy ) పాటు సీనియర్ నేతలు రేణుకా చౌదరి,( Renuka Chowdary ) వీహెచ్ వంటి ప్రముఖులు దరఖాస్తులు సమర్పించారు.రిజర్వ్ సీట్లుగా ఉన్న వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, మహబూబాబాద్ మరియుు ఆదిలాబాద్ స్థానాలకు కూడా భారీగా దరఖాస్తులు వచ్చాయని సమాచారం.కాగా ఈ దరఖాస్తులన్నింటినీ రెండో వారంలో పరిశీలించనున్నారు.అప్లికేషన్లను పరిశీలించిన అనంతరం టీపీసీసీ వాటిని కేంద్ర ఎలక్షన్ కమిటీకి పంపనుంది.ఆ తరువాత 17 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను పార్టీ హైకమాండ్ ప్రకటించనుంది.