Bubble Gum : బబుల్ గమ్ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సుమ కనకాల( Suma Kanakala ) ఒకరు.సుమా కుమారుడిగా రోషన్( Roshan ) అందరికీ ఎంతో సుపరిచితమే.

 Bubble Gum Ott Release Date Lock-TeluguStop.com

ఇలా సుమ రాజీవ్ కనకాల ( Rajeev Kanakala ) కుమారుడిగా గుర్తింపు పొందినటువంటి రోషన్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.రవికాంత్ పేరేపు బబుల్ గమ్ ( Bubble gum ) చిత్రానికి దర్శకత్వం వహించారు.

మానస చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరీ మూవీస్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.

ఇక ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.థియేటర్లో విడుదలైనటువంటి ఈ సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలను చేరుకోలేకపోయినప్పటికీ రోషన్( Roshan ) నటన మాత్రం అందరిని ఆకట్టుకుందని చెప్పాలి.ఇలా రోషన్ హీరోగా మంచి మార్కులే సంపాదించుకున్నారు.

ఇలా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేసినటువంటి ఈ సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది.

బబుల్ గమ్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా( Aha ) కొనుగోలు చేశారు.ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఆహా ఇటీవల అధికారక ప్రకటన తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు.ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఆహాలో ప్రసారం కానుందని తెలిపారు.

థియేటర్లలో పెద్దగా మెప్పించలేకపోయినటువంటి ఈ సినిమా డిజిటల్ మీడియాలో ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాని థియేటర్లో మిస్సయిన వారందరూ కూడా ఆహాలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube