బి‌ఆర్‌ఎస్ సెంటిమెంట్ అస్త్రం.. ఫలించేనా?

ఏపీలో బలపడాలని చూస్తున్న బి‌ఆర్‌ఎస్ పార్టీ( BRS party ).ఏపీ ప్రజలను ఆకర్షించే ఎత్తుగడలతో ముందుకు సాగుతోంది.

అందులో భాగంగానే విశాఖా ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని పదే పదే తెరపైకి తెస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha Steel Plant ) ను ప్రవేటీకరణ చేస్తూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై అన్నీ వైపులా నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.ఏపీలోని ప్రధాన పార్టీలు కూడా కేంద్రం చర్యను తీవ్రంగా ఖండించాయి.

విశాఖా విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశాయి.

Advertisement

అయితే కేంద్రం మాత్రం ప్రైవేటీకరణ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే లేదని తేల్చి చెబుతోంది.అయితే అధికార వైసీపీ( YCP ), మరియు ప్రతిపక్ష టిడిపి పార్టీలు కేంద్రంతో సక్యతగా ఉన్నందున.ప్రైవేటీకరణ అంశంపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం లేదనే విమర్శ వినిపిస్తోంది.

సరిగ్గా అదే అవకాశాన్ని బి‌ఆర్‌ఎస్ పార్టీ సానుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది.వైసీపీ, టిడిపి పార్టీలు చోరువ చూపని ప్రైవేటీకరణ అంశాన్ని లేవనెత్తి ప్రజల దృష్టి బి‌ఆర్‌ఎస్ పై పడేలా కే‌సి‌ఆర్( KCR ) ప్లాన్ చేస్తున్నారు.

అందుకే పదే పదే ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావవిస్తున్నారు ఏపీ బి‌ఆర్‌ఎస్ నేతలు.ఇటీవల బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్ విశాఖా ప్రైవేటీకరణ రద్దు చేయాలని కేంద్రాని బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ఇక ఏపీ బి‌ఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ( thota Chandrasekhar )కూడా ఈ అంశాన్నే హైలెట్ చేస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు.అయితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై బి‌ఆర్‌ఎస్ చూపిస్తున్న చొరవను బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.కే‌సి‌ఆర్, కే‌టి‌ఆర్ ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇప్పుడు విశాఖా ప్రైవేటీకరణపై స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని కమలనాథులు విమర్శలు గుప్పిస్తున్నారు.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?

తెలంగాణలో సింగరేణితో కలిసి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికిన వాళ్లే ఇప్పుడు విశాఖా స్టీల్ ప్లాంట్ గురించి కోతలు కోస్తున్నారని ఏపీ బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి విమర్శించారు.అయితే ఈ విమర్శల సంగతి అటుంచితే.

Advertisement

విశాఖా ప్రైవేటీకరణ అంశాన్ని ఏపీలో ప్రధాన అస్త్రంగా కే‌సి‌ఆర్ వాడుకొనున్నట్లు తెలుస్తోంది.మరి బి‌ఆర్‌ఎస్ వల్లిస్తున్న ఈ సెంటిమెంట్ అస్త్రం ఆ పార్టీకి ఎంతవరకు మైలేజ్ తీసుకొస్తుందో చూడాలి.

తాజా వార్తలు