హైదరాబాద్ కు కవిత ... నేడు కేసిఆర్ తో భేటీ 

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు( MLC Kalvakuntla Kavitha ) సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈరోజు హైదరాబాద్ కు ఆమె రానున్నారు.  ఈరోజు మధ్యాహ్నం 2.

45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి ఆమె చేరుకుంటారు.బెయిల్ పై విడుదల తరువాత హైదరాబాద్ కు వస్తున్న కవితకు భారీగా స్వాగతం పలికేందుకు అభిమానులు,  తెలంగాణ జాగృతి కార్యకర్తలు,  బీఆర్ఎస్ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.

కవిత నిన్న రాత్రి 9 గంటలకు తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు.  బెయిల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తిచేసుకుని జైలు నుంచి బయటకు రాగానే కవిత కుమారుడు,  భర్త,  సోదరుడు కేటీఆర్ ను( KTR ) ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. 

Brs Mlc Kavitha Granted Bail Will Meet Kcr Today Details, Brs, Bjp, Congress, Ml

ఈ సందర్భంగా తనకు పోరాటం కొత్త కాదని,  18 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తు ఫలాలు చూశానని ఆమె అన్నారు.బీఆర్ఎస్ కు , కేసిఆర్ కు,  నాకు,  నా కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతున్నానని ఆమె అన్నారు.కవిత బెయిల్( Kavitha Bail ) విచారణ సందర్భంగా బిఆర్ఎస్ కీలక నాయకులు చాలామంది ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.

Advertisement
Brs Mlc Kavitha Granted Bail Will Meet Kcr Today Details, BRS, BJP, Congress, ML

వారిలో హరీష్ రావు , కేటీఆర్ తో పాటు,  బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత సురేష్ రెడ్డి,  ఎంపీలు వావిరాజు రవిచంద్ర,  దేనికొండ దామోదర్ రావు,  ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,  సెంబిపుర్రాజు కెవి వివేక్ ఉన్నారు. 

Brs Mlc Kavitha Granted Bail Will Meet Kcr Today Details, Brs, Bjp, Congress, Ml

కవిత భర్త అనిల్ కుమార్ , ఆమె పిల్లలు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , మాజీ మంత్రులు,  మాజీ ఎంపీలు,  వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు,  జాగృతి కార్యకర్తలు జైలు వద్దకు వెళ్లి ఆమెకు స్వాగతం తెలిపారు.నిన్న రాత్రి తీహార్ జైలు( Tihar Jail ) నుంచి విడుదలైన కవిత ప్రస్తుతం ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలోని ఉన్నారు.ఈరోజు రౌస్ రెవెన్యూ కోర్టులు సిబిఐ చార్జిషీట్ పై విచారణ జరగనుంది .ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టుకు వర్చువల్ గా కవిత హాజరుకానున్నారు.కోర్టు ప్రొసీడింగ్స్ పూర్తయ్యాక 2.30కి హైదరాబాద్ కు కవిత వెళ్ళనున్నారు.హైదరాబాద్ కు చేరుకోగానే వెంటనే తన తండ్రి, బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో( KCR ) కవిత ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

Advertisement

తాజా వార్తలు