ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ (X) డౌన్..

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఫేస్బుక్ ,ఇన్స్టాగ్రామ్, X (ట్విట్టర్) అంటూ ఇలా పలు రాకల యాప్స్ ను ఉపయోగిస్తూ ఉన్నారు.

 ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ (x)-TeluguStop.com

అయితే, తాజాగా ట్విట్టర్( Twitter ) సేవలకు అంతరాయం ఏర్పడింది.ప్రపంచవ్యాప్తంగా X సేవలు నిలిచిపోయాయి అంటూ అనేక ఫిర్యాదులు తలెత్తాయి.

అమెరికాలో దాదాపు 27,000 మంది తాము పోస్ట్ చేస్తుంటే ట్విట్టర్ లో పోస్ట్ అవడం లేదు అని ఫిర్యాదులు చేశారు.అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Downdetector.com ప్రకారం ఎక్స్ మంగళవారం చివర్లో ప్రపంచవ్యప్తంగా సమస్య ఏర్పడినట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో డౌన్‌డెటెక్టర్, వినియోగదారులతో సహా అనేక మూలాల నుండి స్టేటస్ రిపోర్ట్ ల ద్వారా అంతరాయలను ట్రాక్ చేసామని., ఒక్క అమెరికాలోనే 27,700 కంటే ఎక్కువ మందికి ఇలా అంతరాయం ఏర్పడినట్లు ట్విట్టర్ సంస్థ వారు తెలియజేశారు.అయితే ఎలాన్ మాస్క్( Elon Musk ) ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేసిన అనంతరమే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నట్లు కొన్ని వర్గాలు వాపోతున్నాయి.ఇది ఇలా ఉండగా.

మరోవైపు ఇలాంటి సాంకేతిక లోపాలకు సంబంధించి మాత్రం నుంచి మాస్క్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తుంది.

ఇక మరోవైపు X లో ప్రస్తుతం ట్విట్టర్ డౌన్ అనే హాష్ టాగ్( #Twitter Down ) ట్రెండ్ గా కొనసాగుతుంది.అయితే కొందరు.దేశాలలో ట్విట్టర్ డౌన్ అని పోస్ట్ చేస్తుంటే.

మరికొందరు మాకు ట్విట్టర్ బాగానే పనిచేస్తుంది అంటూ ట్వీట్స్ చేస్తూ ఉన్నారు.అలాగే మరికొందరు అయితే.

, వారు ట్విట్టర్లో పోస్ట్ చేస్తే పోస్ట్ అవ్వటం లేదనేది రిఫ్రెష్ అవ్వటం లేదని., ముందుగా పోస్ట్ కాకపోతే ఫోన్ సమస్య అనుకున్నాం కానీ.

ట్విట్టర్ డౌన్ అయిందని తెలియదు అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.కాగా ఎలాన్ మాస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాతే ఇలా డౌన్ అవ్వడం మొదలు అవుతుందని చాలామంది విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube