బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైందని తెలుస్తోంది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనకు మరోసారి నోటీసులు ఇవ్వడంపై కవిత సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తన పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారని సమాచారం.అయితే కవిత పిటిషన్ ను ధర్మాసనం తిరస్కరించిందని తెలుస్తోంది.
ఈ పిటిషన్ పై 24వ తేదీనే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.







