ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు గట్టి షాక్ తగిలింది.శ్రీకాకుళం జిల్లాలోని అచ్చెన్న సొంత నియోజకవర్గంలో వారి స్వగ్రామం అయిన నిమ్మాడ నుంచి అచ్చెన్న సోదరుడి కుమారుడు వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా రంగంలో ఉండడంతో అచ్చెన్న జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా కింజారపు అప్పన్న పోటీకి రెడీ అయ్యారు.నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆయనపై అచ్చెన్న ఫోన్లో బెదిరింపులకు దిగడంతో పాటు నామినేషన్ వేయకుండా ఆపే ప్రయత్నం కూడా చేశారట.
అయినా అప్పన్న తన బాబాయ్ మాట వినకుండా నామినేషన్ వేసేందుకు రెడీ అవ్వడంతో అచ్చెన్న అనుచరులు అప్పన్న ఇంటికి చేరుకుని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారట.అయితే అప్పన్న మాత్రం తన బాబాయ్ అచ్చెన్నపై ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది.
గత టీడీపీ ప్రభుత్వ విధానాల వల్ల తన భార్య ఉద్యోగం కూడా పోయిందని.అప్పటి నుంచి తనను బాబాయ్ అస్సలు పట్టించుకోలేదని ఆవేదనతో ఉన్నారట.
దీంతో అప్పన్న మాత్రం తాను వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి తీరుతానని మరీ సవాళ్లు రువ్వుతోన్న పరిస్థితి.

అప్పన్న నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు రంగంలోకి దిగారు.వీరిలో అచ్చెన్నాయుడు అన్న హరిప్రసాద్ కూడా ఉన్నారని అంటున్నారు.నామినేషన్ వేయకుండా అప్పన్నను నామినేషన్ కేంద్రం వద్ద బలవంతంగా బయటకు గెంటివేశారని కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ప్రస్తుతం నిమ్మాడలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అప్పన్న అక్కడ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాడంటే పరోక్షంగా అది అచ్చెన్నపైనే అని చెప్పాలి.
ఏదేమైనా అచ్చెన్నకు ముందుగా టెక్కలిలో కాకుండా ఆయన స్వగ్రామంలో చెక్ పెట్టే ప్లాన్‌లో భాగంగానే జగన్ ఆధ్వర్యంలో దువ్వాడ శ్రీను నడిపిస్తోన్న గేమ్‌లో ఇదంతా భాగం అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఏదేమైనా జగన్ మార్క్ ట్విస్టుతో అచ్చెన్న మైండ్ బ్లాక్ అయినట్టే కనిపిస్తోంది.