ప్రధాని మోదీ రాష్ట్రానికి ఎన్ని కాలేజీలు మంజూరు చేశారో చెప్పాలని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రం కావాలనే కుట్రపూరిత చర్యలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు.
తెలంగాణలో 2014కు ముందు ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటు చేశారన్నారు.
కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్తగా 16 వైద్య కళాశాలలు మంజూరు చేశారని తెలిపారు.
జిల్లాకు ఒకటి చొప్పున మరో 13 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.సంగారెడ్డి, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి అయ్యాయని చెప్పారు.
త్వరలోనే కొత్తగూడెం మెడికల్ కాలేజీని కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు.







