బుల్లితెర సీరియళ్ల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో విష్ణుప్రియ సిద్దార్థ్ వర్మ జోడీ ఒకటి.పెళ్లి చేసుకుని రియల్ కపుల్ గా మారిన ఈ జోడీకి సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
వరుసగా బుల్లితెర సీరియళ్లలో నటిస్తూ విష్ణుప్రియ తన పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు.తాజాగా విష్ణుప్రియ పుట్టినరోజు సందర్భంగా షాపింగ్ చేశారు.
భర్త సిద్దార్థ్ వర్మతో కలిసి ఆభరణాల దుకాణానికి వెళ్లిన ఈ నటి అక్కడ తనకు నచ్చిన ఇయర్ రింగ్స్ తో పాటు నెక్లెస్, గాజులను కొనుగోలు చేశారు.తాను కొనుగోలు చేసిన బంగారం 200 గ్రాముల((20 తులాలు) కంటే ఎక్కువ అని ఆమె చెప్పుకొచ్చారు.భార్య నచ్చిన నగలను ఎంపిక చేసుకోగా సిద్దార్థ్ వర్మ ఆ నగలను ప్యాక్ చేయించి బిల్లు చెల్లించారు.“నా బర్త్ డేకి మావారి బంగారు కానుక” అంటూ విష్ణుప్రియ వీడియోను రిలీజ్ చేయడం గమనార్హం.
విష్ణుప్రియ పలు సినిమాలలో కూడా నటించి ఆ సినిమాల ద్వారా కూడా పాపులారిటీని పెంచుకున్నారు.విష్ణుప్రియ షేర్ చేసిన ఈ వీడియోకు 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియో నగలను ఇష్టపడే వాళ్లకు ఎంతగానో నచ్చుతోంది.విష్ణుప్రియకు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
విష్ణుప్రియ యూట్యూబ్ ఛానల్ కు 3,40,000కు పైగా సబ్ స్కైబర్లు ఉన్నారు.

సిద్దార్థ్ వర్మ విష్ణుప్రియ జోడీ చాలా బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కలకాలం వీళ్లిద్దరూ అన్యోన్యంగా ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సిద్దార్థ్ వర్మ జనవరిలో నా బర్త్ డే కూడా వస్తుందని కామెంట్లు చేశారు.
విష్ణుప్రియ ఆ కామెంట్లకు స్పందిస్తూ నువ్వు మహా అంటే వాచ్ తప్ప ఏం అడుగుతావని అన్నారు.







