5G స్పీడ్ ఎలా ఉండబోతోందో తెలుసా? చూస్తే ఆశ్చర్యపోతారు !

మనదేశంలో ఇప్పటికి చాలామంది 4G సేవలను వినియోగించట్లేదు.అసలు జియో రాకపోయుంటే 4G వైపు మన ధ్యాస వెళ్ళేదే కాదు.

కాని 5G ని రుచి చూడబోతున్నాయి అభివృద్ధి చెందిన దేశాలు.అందులోనూ చైనా ఇప్పటికే 5G సిగ్నల్ స్టేషన్స్ మీద పనిచేస్తోంది.

మరో ఏడాదిన్నర - రెండేళ్ళలో 5G సేవలో చైనాలోకి పూర్తిగా కాకపోయినా, కొంతవరకైనా అందుబాటులోకి రావడం ఖాయమని అంటున్నారు టెక్ నిపుణులు.మరి ఈ 5G ఏంటి ? ఎలా ఉండబోతోంది? జీరో లెటేన్సి, ఫాస్ట్ రెస్పాన్స్ టైమ్.ఊహకందని స్పీడ్ తో రాబోతోంది 5G.సింపుల్‌గా చెప్పాలంటే 5G స్పీడ్ ఏకంగా 10 GBPS దాకా వెళ్ళవచ్చు అని అంచనా.అంటే 4G కన్నా 40 రెట్లు వేగంగా ఉండబోతోంది అన్నమాట 5G.ఉదాహరణకు చెప్పాలంటే, 4G 1800 మెగాహెర్జ్ ఫ్రీక్వెన్సితో పనిచేస్తే, 5G 73000 మెగాహెర్జ్ ఫ్రీక్వెన్సీతో పనిచేస్తుంది అన్నమాట.4K వీడియోలు కూడా బఫర్ అవవు.లైవ్ ప్రసారాల్లో 4G నెట్వర్క్ లో 60 మిల్లిసెకన్ల డిలే ఉంటే, 5G లో ఇది శూన్యం అని అంటున్నారు.ఇక ఫోన్ కాల్స్ జియోని మించిన క్వాలిటితో, 4G కన్నా 16 రేట్ల నాణ్యతతో ఉంటాయి.1080P సినిమా అయినా సరే, సెకన్లలో డౌన్లోడ్ అయిపోతుంది.అయితే ఈ వేగాన్ని తట్టుకోవడం ప్రస్తుతం మన చేతిలో ఉన్న పరికరాల వల్ల కాని పని.కంప్యూటర్, ల్యాప్ టాప్స్, స్మార్ట్ ఫోన్స్, టాబ్లేట్స్ .అన్ని అత్యాధునిక టెక్నాలజీతో రావాల్సిందే.అందుకే 5G సేవలో పూర్తిగా అందుబాటులోకి రావడానికి మరో ఐదేళ్ల సమయమైనా పడుతుంది.

పిల్లలు ఇలా తయారవుతున్నారేంటి.. ఫోన్ లాక్కోగానే టీచర్‌ను చంపేస్తానన్న విద్యార్థి.. వీడియో చూస్తే..!
Advertisement

తాజా వార్తలు