హీరోయిన్లు పెళ్ళికి ముందు ఒకలాగా, పెళ్ళి తరువాత ఒకలాగా ఉంటారు.పెళ్ళి జరిగిన తరువాత కొన్ని సామాజిక కారణాల వలన గ్లామర్ ప్రపంచానికి దగ్గరగా బ్రతికినా, గ్లామర్ కి దూరంగా బ్రతకడం మొదలుపెడతారు నటీమణులు.
మహేష్ బాబుని పెళ్ళి చేసుకున్న నమ్రత, పవన్ కళ్యాణ్ ని పెళ్ళి చేసుకున్న రేణు దెశాయ్, నాగార్జునని పెళ్ళి చేసుకున్న అమల .అందరూ పెళ్ళి ఇలా ఖాయమవగానే సినిమా ప్రపంచాన్ని వదిలేశారు.
ఇప్పుడు ట్రెండ్ మారింది.సమంత తనకు తానుగా, సినిమాలు మానేస్తే తప్ప, తన వలన మాత్రం సినిమాలు మానేయడం జరగదని నాగచైతన్య ఇప్పటికే ప్రకటించాడు.నిజంగా మెచ్చుకోదగిన విషయం.దానికి అక్కినేని అభిమానులు కూడా నెగెటివ్ గా స్పందించలేదు.
కాని సమంత ఈమధ్య చేస్తున్న గ్లామర్ షో మీదే మండిపడుతున్నారు ఫ్యాన్స్.
బీచ్ లో దిగిన ఫోటోలు తన అకౌంట్ లో పెట్టడం, కురుచ దుస్తుల్లో ఉన్న ప్రైవేట్ ఫోటోలు కూడా పోస్ట్ చేయడం అక్కినేని ఫ్యాన్స్ కి నచ్చట్లేదు.
అక్కినేని ఇంటికి కోడలు కాబోతున్న అమ్మాయి సినిమాల్లోనే కాకుండా, ఇలా బయట కూడా గ్లామర్ షో చేయడం ఏంటని వారి బాధ.సమంత ని ఎవరైనా కంట్రోల్ లో పెట్టాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అయినా, వీళ్ళ ఓవర్ యాక్షన్ కాకపోతే, సమంత ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటుంది.నాగచైతన్యకి లేని ఇబ్బంది వీరికి ఎందుకో.