పెళ్లిపీటలపై గర్భవతి అయిన వధువు.. బిత్తరపోయిన వరుడు

పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాల మధ్య నూతన జీవితాన్ని మొదలుపెట్టేందుకు వరుడు, వధువు పసుపు బట్టలతో పెళ్లిపీటలపై కూర్చున్నారు.

ఇంతలో జరిగిన ఓ సంఘటన ఆ జంటతో పాటు అక్కడున్న వారందరినీ అవాక్కయ్యేలా చేసింది.

బీర్బుమ్ గ్రామంలో జరిగిన ఓ పెళ్లిలో వధువు కళ్లు తిరిగి పడిపోయింది.దీంతో అక్కడున్న వ్యక్తుల్తో ఓ డాక్టర్ వచ్చి ఆమెను పరీక్షించాడు.

ఆమె అయిదు నెలల గర్భవతి అని తేల్చిచెప్పాడు.ఇది విన్న వరుడు, అతడి కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన బంధువులు నోరెళ్లబెట్టారు.

తాళి కట్టిన తన భార్యతో కొత్త జీవితాన్ని ఊహించుకున్న ఆ వరుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి వెళ్లిపోయాడు.బిత్తరచూపులు చూడటం తప్ప అతడి నోటమాట రాలేదు.

Advertisement

ఆ వధువు గర్భం రావడానికి ఆమె స్నేహితుడొకడు కారణం అని చావు కబురు చల్లగా చెప్పుకొచ్చింది.అంతే, ఒక్కసారిగా వరుడు తరఫు బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

పెళ్లికూతురి తరఫువారు మోసం చేసిన ఆ ప్రబుద్ధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.పాపం ఆ వరుడు మాత్రం పిచ్చిచూపులు చూస్తూ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయాడు.

Advertisement

తాజా వార్తలు