'బ్రహ్మాస్త్ర' ఓపెనింగ్స్ అంతనా.. ఈ ఏడాది హైయెస్ట్ ఓపెనింగ్స్ లో ఒకటిగా..

కరోనా తర్వాత బాలీవుడ్ చాలా కష్టాలను ఎదుర్కొంటుంది.ఒక్కటంటే ఒక్క హిట్ కూడా అందుకోలేక పోతుంది.

ఈసారి అయినా సాలిడ్ కొట్టాలని అనుకుని మళ్ళీ అయ్యింది.ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా తో, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ తో భారీ నష్టాలను అందించారు.

ఇక ఇప్పుడు బ్రహ్మాస్త్ర కూడా అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.అయితే ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

ముందు నుండి బాగా ప్రొమోషన్స్ చేయడంతో ఈ సినిమాకు ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో అని ఆసక్తిగా ఎదురు చూసారు.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 9 వేలకు పైగానే స్క్రీన్ లలో రిలీజ్ అయ్యింది.

Advertisement

మరి అంతా అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ అందుకుంది.బ్రహ్మాస్త్ర సినిమా ఫస్ట్ డే ఏకంగా 75 కోట్లు రాబట్టినట్టు మేకర్స్ అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటించారు.

ఈ మేరకు ఆడియెన్స్ కు థాంక్స్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసారు.బాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా రెండంకెల ఓపెనింగ్స్ రావడమే కష్టమైంది.

అయితే చాలా రోజుల తర్వాత ఇంత ఓపెనింగ్స్ రావడంతో కాస్త ఖుషీగా ఉన్నారు.ఈ ఏడాదిలో ఈ సినిమా హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల జాబితాలో చేరిపోయింది.

మరి ముందు ముందు ఎన్ని కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్ అయ్యింది.400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించగా అమితాబ్ బచ్చన్, నాగార్జున కూడా కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు