పిచ్చి పుకార్లకు సమాధానం ఇవ్వలేకపోతున్నా

వెండి తెరపై దాదాపుగా రెండు దశాబ్దాల పాటు స్టార్‌ కమెడియన్‌గా వెలుగు వెలిగిన బ్రహ్మానందం గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.

దూరంగా ఉంటున్నాడు అనడం కంటే ఆయన్ను ప్రేక్షకులు ఈమద్య కాలంలో తిరష్కరిస్తున్నారు అనడం బెటర్‌.

ఆయన పాత్రలు నవ్వించడంలో సఫలం కావడం లేదని దర్శకులు ఆయన్ను దూరంగా ఉంచారు.దాంతో ఆయన సినిమాల్లో నటించడం లేదు.

గత అయిదు సంవత్సరాలుగా బ్రహ్మానందం సినిమాలకు మెల్లగా దూరం అవుతూ వచ్చి ఈమద్య కాలంలో అసలే నటించడం లేదు.వెండి తెరపై ఆఫర్లు లేని బ్రహ్మానందం బుల్లి తెరపై కనిపించబోతున్నాడు అంటూ గత రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి.

మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో బ్రహ్మానందం స్పందించాడు.గత రెండు నాలుగు నెలలుగా నేను పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి ఉన్నాను.

Advertisement
Brahmanandam, Small Screen, Brahmanandam Trashes Rumors, Brahmanandam TV Shows,

నేను టీవీ సీరియల్స్‌ షోలు చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు.

Brahmanandam, Small Screen, Brahmanandam Trashes Rumors, Brahmanandam Tv Shows,

గతంలో బ్రహ్మానందంను బుల్లి తెరపైకి తీసుకు వచ్చిన ఒక నిర్మాణ సంస్థ మరోసారి ఆయన్ను తీసుకు రావాలని ప్రయత్నాలు చేసింది.కాని బ్రహ్మానందం మాత్రం అస్సలు ఒప్పుకోలేదట.సినిమాలు చేయకున్నా కూడా తాను మాత్రం బుల్లి తెరపై కనిపించబోవడం లేదంటూ పేర్కొన్నాడు.

ప్రస్తుతం తన మనవడితో ఫుల్‌ టైం పాస్‌ చేస్తున్నాను.పుస్తకాలు చదవడంతో పాటు బొమ్మలు వేయడం చేస్తున్నాను.

సినిమాల్లో ఆఫర్లు లేనంత మాత్రాన నేనేమి కూడా ఆందోళనలో లేను.నేను సీరియల్స్‌లో నటిస్తున్నట్లుగా వార్తలు రావడంతో చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
బాలీవుడ్ హీరోతో సినిమాకి కమిట్ అవ్వనున్న ప్రశాంత్ వర్మ..

వారికి సమాధానం చెప్పలేకి విసిగి పోయాను అంటూ బ్రహ్మానందం వ్యాఖ్యలు చేశాడు.

Advertisement

తాజా వార్తలు