వైసీపీని వీడనున్న బొప్పన భవకుమార్..!!

విజయవాడ నగర వైసీపీ అధ్యక్షులు బొప్పన భవకుమార్( Boppana Bhavakumar ) పార్టీని వీడనున్నారు.

ఈ క్రమంలోనే ఆయన ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు.

టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) ను బొప్పన కలిశారు.కాగా ఈ సమావేశానికి బొప్పనతో పాటు కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ వెళ్లారు.

వైసీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న భవకుమార్ ఇప్పటికే వంగవీటి రాధ సహా ఇతర నేతలతో సమావేశమై చర్చించారు.మరోవైపు వైసీపీ పెద్దలు బొప్పనతో బుజ్జగింపులు జరిపినా ప్రయోజనం లేదని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వైసీపీని వీడనున్న బొప్పన భవకుమార్ టీడీపీ గూటికి చేరనున్నారని తెలుస్తోంది.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు