ఆరెంజ్ సినిమాను ఆ స్టైల్‌లో తీద్దామనుకున్న భాస్కర్.. అది చాలా బోల్డ్ గురూ..?

2010లో విడుదలైన రొమాంటిక్ కామెడీ మూవీ "ఆరెంజ్( Orange Movie )" డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.బొమ్మరిల్లు భాస్కర్ దీన్ని డైరెక్ట్ చేశాడు.

ఈ చిత్రంలో రామ్ చరణ్, జెనీలియా డిసౌజా, షాజన్ పదమ్సీ హీరో హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమా స్టోరీ బాగానే ఉంటుంది కానీ అప్పటి ప్రేక్షకులు దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు.

ఇదొక కాంప్లెక్స్, ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్‌తో వచ్చింది.చాలాకాలం తర్వాత ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడం అది ఫేవరెట్ గా మారిపోవడం జరిగింది.

క్రిటిక్స్ కూడా ఈ మూవీ వీటివల కాలంలో వచ్చి ఉంటే బ్లాక్ బస్టర్ హిట్ అయి ఉండేది అని అభిప్రాయపడ్డారు.

Bommarilu Bhaskar About Orange Movie ,orange Movie, Bommarilu Bhaskar , Naga Ba
Advertisement
Bommarilu Bhaskar About Orange Movie ,Orange Movie, Bommarilu Bhaskar , Naga Ba

ఆరెంజ్ సినిమా తర్వాత కూడా భాస్కర్ పెద్దగా హిట్స్ సాధించలేకపోయాడు 2021లో అతను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్( Most Eligible Bachelor ) సినిమాతో ఒక మోస్తారు హిట్ సాధించాడు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భాస్కర్ ఆరెంజ్ మూవీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.ఆయన మాట్లాడుతూ "నాకు ఈ సినిమాని మరో స్టైల్ లో నేరేట్‌ చేయాలని అనిపించింది.

కానీ ఆ నేరేషన్ చాలా బోల్డ్ గా ఉంటుంది.ఆల్రెడీ ఈ సినిమా కోసం ఒక కాంప్లెక్స్ సబ్జెక్టు తీసుకున్నాము.

సినిమాని నాకు నచ్చిన స్టైల్ లో అంటే బోల్డుగా తీసినట్లైతే అది మరింత కాంప్లెక్స్ గా మారిపోయే అవకాశం ఉంది ప్రేక్షకులకు అది ఎక్కకపోవచ్చు.అప్పటి ప్రేక్షకులు అలాగే ఉన్నారు మరి.అందుకే సింపుల్ వేలో డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదామని భావించా.అలాగే సినిమా తీశా.

" అని తెలిపాడు.

Bommarilu Bhaskar About Orange Movie ,orange Movie, Bommarilu Bhaskar , Naga Ba
వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?

ఆరెంజ్ మూవీ కోసం భాస్కర్ ( Bhaskar )రాసిన ఆ స్టైల్ ఎలా ఉంటుంది అని చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.అదే స్టైల్ లో ఆరెంజ్ 2 మూవీ తీయాలని కోరుకుంటున్నారు.భాస్కర్ ఇప్పటి తరం ప్రేక్షకులకు నచ్చేలాగా రాంచరణ్ తో ఆరంజ్ లాంటి సినిమా అందుకుంటే అతనిపై పడిన మచ్చ అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది.

Advertisement

నాగబాబు ఈ సినిమా వల్ల బాగా నష్టపోయారు.దీన్ని సీక్వెన్స్ తీస్తే ఆయన వేరే వాళ్లతో కలిసి దీన్ని ప్రొడ్యూస్ చేయవచ్చు.మంచి హిట్ అయితే కోల్పోయిన డబ్బులు తిరిగి పొందొచ్చు.

ప్రస్తుతం భాస్కర్ "జాక్" అనే ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు.

తాజా వార్తలు