బాలీవుడ్లో ఎటువంటి పాత్రనైనా అవలీలగా చేస్తూ తనకంటూ చెరిగిపోని గుర్తింపు తెచ్చుకున్నటువంటి విలక్షణ నటుడు హీరో ఇర్ఫాన్ ఖాన్ గురించి బాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అంతేకాక హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇర్ఫాన్ ఖాన్ తన పని తాను చేసుకుంటూ పోయేవాడు.
అయితే గత కొద్దికాలంగా ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ తో బాధ పడుతున్నాడు.అయితే ఈ క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ కాకముందే “అంగ్రేజీ మీడియం” అనే ఈ చిత్రంలో నటించాడు.
కానీ షూటింగ్ పూర్తయిన తర్వాత క్యాన్సర్ వ్యాధి సోకినట్లు నిర్ధారణ కావడంతో ప్రస్తుతం పూర్తిగా చికిత్స తీసుకుంటు విశ్రాంతిలో ఉన్నాడు.
అయితే ఈ వార్త ఒక్కసారిగా బాలీవుడ్ సినీ పరిశ్రమను కుదిపేసింది.
దీంతో తమ అభిమాన నటుడు క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతూ ఉండటం చాలా బాధాకరమని, తొందర్లోనే ఈ క్యాన్సర్ మహమ్మారి నుంచి ఇర్ఫాన్ కోలుకోవాలని ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు.అయితే తాను నటించినటువంటి అంగ్రేజీ మీడియం చిత్రంలో ఓ పాట కి ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అయినటువంటి కృతి సనన్, జాన్వీకపూర్, కత్రినా కైఫ్, అనన్యా పాండే, అలియాభట్, అనుష్క శర్మ తదితరులు డాన్స్ చేస్తూ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేశారు.
అంతేగాక ఈ వీడియోని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసి ఇర్ఫాన్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.

అయితే తాజాగా తనకు సోకిన క్యాన్సర్ విషయంపై ఇర్ఫాన్ స్పందించాడు.అంతేకాక మానవ జీవితంలో భార్య ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుందో ఈ సంవత్సర కాలంలోనే తెలుసుకున్నానని ఆమె కోసమైనా బ్రతకాలని అనిపిస్తోందని అన్నాడు.అంతేగాక గత కొద్దికాలంగా ఇంట్లోనే ఉండటంతో తన కుటుంబ విషయాలను కూడా తన అర్థాంగి సుపాత ఎలా చక్కబడుతుందనే విషయాలను అర్థం చేసుకున్నానని, తనకి చాలా సంతోషంగా ఉందని అంటున్నాడు.
ఏదేమైనప్పటికీ ఇర్ఫాన్ ఖాన్ తొందరగా ఈ క్యాన్సర్ బారినుంచి కోలుకొని మళ్ళీ సినిమాల్లో నటించాలని పలువురు అభిమానులు కోరుకుంటున్నారు.
.