అల్లు అర్జున్ పై బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హాట్ కామెంట్.. నెట్టింట్లో వైరల్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తాజాగా అల్లు అర్జున్ పై బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరుణ్ జోహార్ ప్రశంసలు కురిపించారు.

ఇలా ఉన్నఫలంగా అల్లు అర్జున్ పై కరణ్ జోహార్ ప్రశంసలు కురిపించడానికి కారణం ఏమిటి? ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందా లేకపోతే అతనిపై ఉన్నఫలంగా ప్రశంసలు కురిపించడానికి కారణం ఏమిటి అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అయితే కరణ్ జోహార్ అల్లు అర్జున్ ను సూపర్ స్టార్ అనడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.

అల్లు అర్జున్ తాజాగా నాగ శౌర్య రీతువర్మ జంటగా నటించిన వరుడు కావలెను సినిమా రిలీజ్ వేడుకలకు హాజరయ్యారు.ఈ వేడుకలో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సినిమాలు చూడటానికి థియేటర్లకు రావాలని,ఇలా థియేటర్ లో సినిమాలను చూసి సినిమా ఇండస్ట్రీకి పూర్వవైభవం తీసుకురావాలని ప్రేక్షకులను కోరారు.

కేవలం తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా అన్ని భాషా చిత్రాలను కూడా థియేటర్లో చూస్తూ ఆదరించాలని అల్లుఅర్జున్ తెలియజేశారు.అదే విధంగా బాలీవుడ్ సినిమా సూర్య వంశీ సినిమాకు దక్షిణాది భారతదేశం తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

బన్నీ ఈ విధంగా తన సినిమా గురించి మాట్లాడటంతో కరణ్ జోహార్ అతని పై ప్రశంసలు కురిపిస్తూ ఎలా చూసుకున్నా అల్లు అర్జున్ సూపర్ స్టార్ అంటూ అతని పై ప్రశంసలు కురిపించారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ వేదికపై మాట్లాడిన మాటల క్లిప్ షేర్ చేస్తూ మీరు ఏ రకంగా చూసుకున్నా సూపర్ స్టార్ మీకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ కావడంతో బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం
Advertisement

తాజా వార్తలు